India corona cases : దేశంలో కొత్తగా 4,03,738 కరోనా కేసులు..!

India corona cases : దేశంలో కొత్తగా 4,03,738 కరోనా కేసులు..!
India corona cases : దేశంలో కరోనా మహామ్మరి ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో వరుసగా నాలుగో రోజూ 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి.

India corona cases : దేశంలో కరోనా మహామ్మరి ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో వరుసగా నాలుగో రోజూ 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. అటు మరణాలు కూడా నాలుగు వేలు దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 18,65,428 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 4,03,738 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 4,092 వైరస్ కి బలైపోయారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,22,96,414కి చేరింది.

అటు మరణాల సంఖ్య 2,42,362కి చేరుకుంది. నిన్న ఒక్క రోజే 3,86,444 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 1,83,17,404కి చేరింది. అయితే కొత్త కేసులతో పాటుగా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండడం కాస్తా ఉరటను కలిగిస్తుంది. ప్రస్తుతం దేశంలో 37,36,648 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక 16,94,39,663 మందికి కరోనా టికాను అందించారు.

Tags

Read MoreRead Less
Next Story