Wear Mask : దేశంలో 50% మంది మాస్కు పెట్టుకోవడం లేదు : కేంద్రం

Wear Mask : దేశంలో 50% మంది మాస్కు పెట్టుకోవడం లేదు : కేంద్రం
Wear Mask : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. రోజుకూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి.

Wear Mask : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. రోజుకూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో మాస్కు, భౌతిక దూరం తప్పనిసరి అంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దేశంలో సగం మంది మాస్కులు పెట్టుకోవడం లేదని కేంద్రం తాజాగా వెల్లడించింది. దేశంలో 64% మంది ముక్కును కప్పి ఉంచేలా మాస్క్ సరిగ్గా లేదని ఓ అధ్యయనంలో తేలిందని పేర్కొంది.

ఇక ఇరవై శాతం మంది గడ్డం వరకు, రెండు శాతం మంది మెడ దగ్గరకు మాస్క్ ఉంచుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం 14 శాతం మంది మాత్రమే పగడ్బందీగా ముక్కు, నోరు, గడ్డాన్ని కప్పి ఉంచేలా మాస్క్ పెట్టుకుంటున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే భౌతిక దూరంతో పాటు మాస్కులు ధరించడం తప్పనిసరని అన్నారు.

అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులను ఒక్కసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,76,110 కరోనా కేసులు నమోదయ్యాయి. 3,69,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా 3,874 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 31,29,878 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story