కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా..!

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా..!
కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లుగా కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లుగా కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మొత్తాన్ని స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌(రాష్ట్రాల విపత్తు సహాయ నిధి) ద్వారా ఇస్తామని వెల్లడించింది. కాగా ఇప్పటి వరకు దేశంలో 4.45 లక్షలమంది మహమ్మారి బారిన పడి మరణించారు. ఇప్పటి వరకు మరణించిన వారితోపాటు భవిష్యత్తులోనూ కరోనాతో ప్రాణాలు విడిచిన వారందరికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఈ ఎక్స్‌ గ్రేషియా పొందాలంటే ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాల ప్రకారం సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే బిహార్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కరోనాతో మరణించిన వారికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story