National Corona cases : దేశంలో కొత్తగా 50,040 కేసులు, 1,258 మరణాలు..!

National Corona cases :  దేశంలో కొత్తగా 50,040 కేసులు, 1,258 మరణాలు..!
National Corona cases : దేశంలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల వద్దే నమోదవుతున్నాయి.

National Corona cases : దేశంలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల వద్దే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 వేల 40 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కొవిడ్‌తో మరో 1258 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు కరోనాతో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం 50వేలకు పైగా నమోదవుతున్నాయి. నిన్న మరో 57 వేల 944 మంది డిశ్చార్జ్ అవగా.. ఇప్పటి వరకు 2 కోట్ల 92 లక్షల మందికిపైగా కొవిడ్‌ను జయించారని భారత వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగింది. అటు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 64 లక్షల 25 వేల 893 టీకా డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 32 కోట్ల 17 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story