గుడ్‌న్యూస్.. అన్ని రుణాలపై 6 నెలల చక్రవడ్డీ మాఫీ

గుడ్‌న్యూస్.. అన్ని రుణాలపై 6 నెలల చక్రవడ్డీ మాఫీ
ఈ ఏడాది మార్చి 1 నుంచి ఆగస్టు 31 మధ్య కట్టాల్సిన వాయిదాలపై మారటోరియం సదుపాయాన్ని ఉపయోగించుకున్న వారికి

కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థ మీద, ఆరోగ్యం మీద కనిపించని దాడి చేసింది.. దాదాపు ప్రపంచం మొత్తం ఈ ఏడాది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాలు ఒకపక్క చేస్తూనే మరోపక్క సగటు జీవి సకాలంలో రుణాలు కట్టడానికి పడే ఇబ్బందులను గుర్తించి వాటన్నింటిని మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన దీపావళి లోగా వెలువడే అవకాశం ఉంది.

ఈ ఏడాది మార్చి 1 నుంచి ఆగస్టు 31 మధ్య కట్టాల్సిన వాయిదాలపై మారటోరియం సదుపాయాన్ని ఉపయోగించుకున్న వారికి ఎలాంటి ప్రయోజనం కలిగిందో అటువంటిది. సకాలంలో రుణ వాయిదాలు తీర్చిన వారికి ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, ఇంటిని తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు వంటి అన్నింటికీ చక్రవడ్డీ మాఫీ వర్తిస్తుంది. దీనివల్ల వాణిజ్య బ్యాంకులకు వాటిల్లే నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది.

"ఉద్యోగాలను పరిరక్షించాల్సిన అవసరంతో పాటు ఆర్థిక వృద్ధిని తిరిగి తీసుకురావడానికి చేసే ప్రతి ప్రయత్నంలో భాగమే ఇది. మొత్తం మొరటోరియం కోసం అన్ని వర్గాల రుణగ్రహీతలందరికీ రుణాలు పూర్తిగా మాఫీ చేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తే బ్యాంకులు దాదాపు రూ.6 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూస్తాయని అఫిడవిట్ పేర్కొంది .

Tags

Read MoreRead Less
Next Story