నేడు సుప్రీంకోర్టులో తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

నేడు సుప్రీంకోర్టులో తొమ్మిది  మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన 9 మంది.. ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన 9 మంది.. ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చరిత్రలో ఇంతమంది సుప్రీం కోర్టు జడ్జిలుగా ఒకేసారి ప్రమాణం చేయనుండటం ఇదే తొలిసారి. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు సుప్రీంకోర్టు అదనపు భవనం ఆడిటోరియంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి రమణ... వీరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీనియారిటీ పరంగా వరుస క్రమంలో న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఎన్నాడూ లేని విధంగా సుప్రీం కోర్టు చరిత్రలో తొలిసారి జడ్జిల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ ఎన్వీ రమణ నిర్ణయించారు.

ఇక కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ వెంకటరామయ్య నాగరత్న, జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ మాధుర్య త్రివేది, జస్టిస్‌ శ్రీనరసింహ ప్రమాణం చేస్తారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తి ఆసీనులయ్యే కోర్టు నెం.1లోనే ప్రమాణ స్వీకారం జరిగేది. ఇప్పుడు తొలిసారి ఈ వేదికను ఆడిటోరియంలోకి మార్చారు.

Tags

Read MoreRead Less
Next Story