ఫేషియల్ కోసం వెళ్లిన నటి.. అందవికారంగా మార్చిన డాక్టర్..!

ఫేషియల్ కోసం వెళ్లిన నటి.. అందవికారంగా మార్చిన డాక్టర్..!
అందంగా ఉండేందుకు ఫేషియల్ కోసం వెళ్లిన నటిపై ఓ డాక్టర్ చేసిన ప్రయోగాలతో ఆమె మొహం అందవిహీనంగా మారిపోయింది. తమిళ నటి రైజా విల్సన్‌

అందంగా ఉండేందుకు ఫేషియల్ కోసం వెళ్లిన నటిపై ఓ డాక్టర్ చేసిన ప్రయోగాలతో ఆమె మొహం అందవిహీనంగా మారిపోయింది. తమిళ నటి రైజా విల్సన్‌ ఫేషియల్‌ కోసం డాక్టర్‌ భైరవి సెంథిల్‌ దగ్గరకు వెళ్లింది. ఈక్రమంలో మరింత అందం వస్తుందంటూ బలవంతంగా కొన్ని ప్రయోగాలు ఆమె మొహంపై చేసింది. తీరా చూస్తే రైజా ముఖం వాచిపోయింది. ప్రస్తుతం ఆ డాక్టర్‌ కోసం గాలిస్తున్న నటికి ఆమె చిక్కడం లేదు. తన ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేయడం కాదు కదా, ఉన్న సహజత్వాన్ని నాశనం చేస్తూ ఆమెను అందవికారంగా మార్చింది ఆ డాక్టర్‌.

ఈ షాక్‌తో రైజా తీవ్ర మనోవేదనకు గురైంది. సోషల్‌ మీడియా వేదికగా తనకు ఎదురైన అనుభవాన్ని షేర్‌ చేసుకొని బాధ పడుతోంది. ఫేషియల్‌ కోసం డాక్టర్‌ భైరవి దగ్గరకు వెళ్తే బలవంతంగా నాపై కొన్ని ప్రయోగాలు చేసి నన్నిలా మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏంటిదంతా అని ఆమెను అడగడానికి వెళ్తే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని.. పైగా.. సిబ్బందితో ఊరిలో లేనట్టుగా చెప్పిస్తోందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అంశం వైరల్‌గా మారింది.

రైజా విల్సన్ 2017లో వెలయ్యిలా పట్టధారి 2 సినిమాలోని ఓ చిన్నపాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అనంతరం తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లోనూ పాల్గొంది. 2018లో ప్యార్‌ ప్రేమ కాదల్‌ సినిమాతో హీరోయిన్‌గా మారింది. దీనికిగానూ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సైతం అందుకుంది. ప్రస్తుతం ఆమె అలైస్‌, కాదలిక్క యారుమిల్లై, హ్యాష్‌ట్యాగ్‌ లవ్‌ అనే సినిమాలు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story