Ajith Fan Suicide Attempt: అజిత్ ఇంటి ముందే అభిమాని ఆత్మహత్యాయత్నం..

Ajith Fan Suicide Attempt: అజిత్ ఇంటి ముందే అభిమాని ఆత్మహత్యాయత్నం..
Ajith Fan Suicide Attempt: సినిమా వారికి ఉన్నంత అభిమానులు ఇంకా ఏ రంగంలో పనిచేసి వారికి ఉండరు.

Ajith Fan Suicide Attempt: సినిమా వారికి ఉన్నంత అభిమానులు ఇంకా ఏ రంగంలో పనిచేసి వారికి ఉండరు. అంతే కాదు వారి అభిమానానికి అవధులు కూడా ఉండవు. ఫేవరెట్ హీరో కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయిపోతారు అభిమానులు. తాజాగా అజిత్ అభిమాని ఒకరు తనను ఒక్కసారి కలవాలంటూ, కలవకపోతే చనిపోతానంటూ అజిత్ ఇంటి ముందే ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

వివరాల్లోకి వెళ్తే.. ఫర్జానా అనే మహిళ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. గతేడాది అజిత్, తన భార్య షాలినితో కలిసి ఆ హాస్పటల్‌కు వెళ్లాడు. అప్పుడు ఫర్జానా వారితో కలిసి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికే అజిత్‌కు కరోనా సోకిందని తేలింది. అప్పుడు ఫర్జానాతో దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోలు, వీడియోలు వల్లే ఫర్జానా ఉద్యోగం పోయింది. అజిత్ ఒక్కసారి హాస్పటల్ యాజమాన్యంతో మాట్లాడితే తనకు మళ్లీ ఉద్యోగం వస్తుందని చాలాసార్లు తనను కలిసే ప్రయత్నం చేసింది. కానీ కుదరలేదు. దీంతో తనకు న్యాయం జరగట్లేదని ఏకంగా అజిత్ ఇంటి ముందే ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అంతే కాకుండా తన చావుకు అజితే కారణం అంటూ కేకలు వేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story