టీఎంసీ గద్దె దిగితేనే బెంగాల్‌లో రైతులకు పెట్టుబడి సాయం : అమిత్‌షా

టీఎంసీ గద్దె దిగితేనే బెంగాల్‌లో రైతులకు పెట్టుబడి సాయం : అమిత్‌షా
2021లో అధికారం తమదేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. 200లకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా మిషన్‌ బెంగాల్‌ను ప్రారంభించారు అమిత్‌షా.

2021లో అధికారం తమదేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah). 200లకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా మిషన్‌ బెంగాల్‌ను ప్రారంభించారు అమిత్‌షా. టీఎంసీ కీలక నేత సువేందు సహా పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.

దీదీ సర్కార్‌ను(Trinamool Congress) గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ మిషన్ బెంగాల్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్‌లో పర్యటించారు. మిడ్నాపూర్‌లో జరిగిన బీజేపీ భారీ బహిరంగసభలో TMC కీలక నేత సుబేందు(Suvendu Adhikari) అధికారి అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా వేసుకున్నారు. ఆయనతోపాటు 9 మంది సట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, మాజీ ఎంపీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

దీదీ ప్రభుత్వంలో అవినీతి, బంధుప్రీతి, అసమర్ధ పాలన పెరిగిపోయాయని అమిత్ షా అన్నారు. అందుకే తృణమూల్ కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది ఆరంభం మాత్రమేనని ఎన్నికలు వచ్చే సమయానికి దీదీ ఒక్కరే పార్టీలో మిగులుతారని అమిత్ షా అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన అనేక పథకాలు తృణమూల్ ప్రభుత్వ(Trinamool Congress) అమలు చేయట్లేదన్నారు. టీఎంసీ గద్దెదిగితేనే బెంగాల్‌లో రైతులకు పెట్టుబడి సాయం అందుతుందన్నారు. 2 వందలకుపైగా స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు అమిత్ షా.

బీజేపీకి ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని స్వర్ణ బెంగాల్‌గా మారుస్తామన్నారు అమిత్‌షా. టీఎంసీ ఎంత ఎక్కువ హింసకు పాల్పడితే బీజేపీఅంత ఎక్కువ బలపడుతుందన్నారు. టీఎంసీ గద్దె దిగితేనే బెంగాల్‌లో రైతులకు పెట్టుబడి సాయం అందుతుందన్నారు అమిత్‌షా.

Tags

Read MoreRead Less
Next Story