ఆ చిత్రంలో బాలు, నేను.. మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకం: రాధిక

ఆ చిత్రంలో బాలు, నేను.. మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకం: రాధిక
గాయకుడిగా పలు భాషల్లో పాడి తన గానం ద్వారా అనేక హృదయాలను స్పృశించారు.

భారీ శరీరం అయినా చిన్న పిల్లవాడి మనస్తత్వం.. పేరులోనే వుంది బాలు అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు నటి రాధిక. బాలుతో పాటు నటించిన ఓ పాపా లాలీ చిత్రం గురించి చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.గాయకుడిగా పలు భాషల్లో పాడి తన గానం ద్వారా అనేక హృదయాలను స్పృశించారు. నటుడిగా కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.. అనేక తమిళ చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించారు.రాధిక, బాలు కలిసి నటించిన ఓ పాపా లాలీ చిత్రంలో పాట మాటే రాని చిన్న దాని కళ్లు పలికే ఊసులు పాట భారీ హిట్ గా నిలిచింది.

ఈ చిత్రం విడుదలై దాదాపు మూడు దశాబ్దాలైనా కూడా ఇప్పటికీ ఆ పాట వింటే మనసు పరవశించి పోతుంది.. ఈ ఒక్క పాట ఏంటి బాలు నోటి నుంచి జాలువారిన ఏపాట విన్నా అదే అనుభూతి కలుగుతుంది అని ఆమె అన్నారు.రాధిక మాట్లాడుతూ, ఎస్.పి.బికి ఒక పాట పాడడానికి ఎంత ఉత్సాహంతో, ఎంత స్పృహతో ఉంటారో, అదే విధంగా తను పోషిస్తున్న పాత్ర యొక్క సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి అంతే ఆసక్తి కనబరిచేవారు అని అన్నారు.ఈ చిత్రంలో బాలు ఊపిరి తీసుకోకుండా పాడటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. పాటను ఎలా రికార్డ్ చేశారో చూపించమని నేను అతనిని అడుగుతుండేదాన్ని అని ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఈ పాటను మహాబలిపురంలో చిత్రీకరించారు. నా జీవితంలో మరిచిపోలేని ఓ అద్భుతమైన జ్ఞాపకం.. ఆయనతో నటించడం అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు రాధిక.

Tags

Read MoreRead Less
Next Story