Odisha: రిక్షావాడికి రూ. కోటి విలువైన ఆస్తిని రాసిచ్చిన మహిళ..

Odisha (tv5news.in)

Odisha (tv5news.in)

Odisha: ఒడిశాలో ఓ వృద్ధ మహిళ దానం చేయాలి అనుకునే వారందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Odisha: దానం చేయాలన్నా, సాయం చేయాలన్నా.. మంచి మనసు ఉంటే చాలు. ఈ కాలంలో సంపాదించేది వంద రూపాయలే అయినా.. అందులో యాభ్భై రూపాయలు దానం చేసే వారు ఉన్నారు.. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నా కూడా.. అవసరం కోసం చూసేవారిని పట్టించుకోని మనుషులూ ఉన్నారు. కానీ ఈ రెండిటిలో దానం చేసే వారే ఎక్కువ. తాజాగా ఒడిశాలో ఓ వృద్ధ మహిళ దానం చేయాలి అనుకునే వారందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

ఒడిశాలో నివసించే 63 ఏళ్ల మినతి పట్నాయక్ చేసిన పనికి దేశమంతా ఆశ్చర్యపోతోంది. తన కోటి రూపాయల విలువైన ఆస్తిని తనకు ఏ సంబంధం లేని ఓ రిక్షావాడికి రాసిచ్చేసింది. తాను చేసిన పనిని విన్నవారు ఆశ్చర్యపోవడంతో పాటు తన గొప్ప మనసుని ప్రశంసిస్తున్నారు కూడా.

గతేడాది మినతి భర్త చనిపోయారు. ఇక మిగిలిన జీవితమంతా కూతురితోనే గడపాలి అనుకున్న మినతికి ఆ సంతోషం కూడా మిగలలేదు. తన భర్త చనిపోయిన ఆరు నెలల తర్వాత మినతి కూతురు కూడా గుండెపోటుతో మరణించింది. దీంతో తన జీవితం చీకటైపోయింది. అప్పటివరకు తనను పట్టించుకోని బంధువులు కూడా తన ఆస్తి కోసం దగ్గరవ్వడం మొదలుపెట్టారు.

తన బంధువులు ఎవరికీ తన ఆస్తిని పంచడం ఇష్టం లేని మినతి తన కూతురిని 25 ఏళ్లు రిక్షాలో స్కూలుకు, కాలేజీకి తీసుకెళ్లిన సామల్‌ను పిలిపించింది. తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ సామల్ పేరు మీద రాసేసింది.

Tags

Read MoreRead Less
Next Story