Andhra Bank: ఆంధ్రాబ్యాంక్ అలెర్ట్ మెసేజ్.. పాత కస్టమర్లంతా..

Andhra Bank: ఆంధ్రాబ్యాంక్ అలెర్ట్ మెసేజ్.. పాత కస్టమర్లంతా..
Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లందరూ యూనియన్ బ్యాంక్ రూల్స్‌కి అనుగుణంగా మారవలసి ఉంటుంది.

ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఆంధ్రా బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది బ్యాంక్ యాజమాన్యం.

1. ఇకపై పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లందరూ యూనియన్ బ్యాంక్ కస్టమర్లుగా సేవలందుకుంటారని UBI ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.

2. ఆంధ్రాబ్యాంక్ కస్టమర్లు UBI కస్టమర్లుగా మారినా మీ అకౌంట్ నెంబర్ పాతదే ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. అకౌంట్ నెంబర్‌తో పాటు కస్టమర్ ఐడీ కూడా పాతదే ఉంటుంది.

3.ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు కొత్త పాస్ బుక్స్ వస్తాయి. ఆ పాస్ బుక్స్ అన్నీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో వస్తాయి. కాబట్టి ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లు తమ పాస్ బుక్స్ బ్యాంకులో మార్చుకోవచ్చు. ఇకనుంచి ఆంధ్రా బ్యాంక్ యాప్ కూడా పని చేయదు. కస్టమర్లు U-Mobile యాప్ ఉపయోగించాలి.

4. ఆంధ్రా బ్యాంక్ చెక్స్ కూడా 2021 మార్చి 31 వరకు మాత్రమే పని చేస్తాయి. ఏప్రిల్ 1 నుంచి UBI చెక్స్ ఉపయోగించాలి.

5. ఇక ఆంధ్రా బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కూడా మారుతుంది. ప్రస్తుత ఐఎఫ్ఎస్‌సీ కోడ్ 2021 మార్చి 31 వరకే అమలులో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఉపయోగించాలి. కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI వెబ్‌సైట్‌లో ఉంటుంది.

6. ఇంకా ఏమైనా సందేమాలుంటే UBI కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్లు 1800 208 2244, 1800 22 2 44 కాగా కస్టమర్ కేర్ సెంటర్ నెంబర్ +91-80-61817110.

7.ఇటీవలే ఆంధ్రా బ్యాంక్ అన్ని బ్రాంచ్‌ల ఐటీ ఇంటిగ్రేషన్ పూర్తైందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గతంలో ఆంధ్రాబ్యాంక్ చేసిన సేవలన్నీ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ చేస్తుంది.

8.ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ అయిదో స్థానంలో ఉంది. ఈ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 9590 పైగా బ్రాంచ్‌లు, 13,287 ఏటీఎంలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story