Arvind Kejriwal : కేంద్రానికి అరవింద్ కేజ్రివాల్ నాలుగు సూచనలు..!

Arvind Kejriwal  : కేంద్రానికి అరవింద్ కేజ్రివాల్ నాలుగు సూచనలు..!
Arvind Kejriwal : వ్యాక్సిన్ సరిపడా లేకపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Arvind Kejriwal : వ్యాక్సిన్ సరిపడా లేకపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపట్నుంచి 18-44 ఏళ్ల వారికి టీకా వేయట్లేదని స్పష్టం చేశారు. ప్రతి నెలకు 80లక్షల వ్యాక్సిన్ డోసులు కావాలని.. అయితే మే నెలలో కేవలం16 లక్షల డోసులే వచ్చాయని అన్నారు. నెలకు 8 లక్షల డోసులు వస్తేనే సిటీ అంతటా వ్యాక్సినేషన్‌కు 30 నెలలు పడుతుందని.. ఈలోపు చాలా మంది ప్రాణాలు కోల్పోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వ్యాక్సిన్ కొరత సమస్యను పరిష్కరించడానికి, కేజ్రీవాల్ కేంద్రానికి పలు సూచనలు చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు.

1. దేశంలోని అన్ని వ్యాక్సిన్ తయారీ కేంద్రాలు 24 గంటల్లో కొవార్టిన్ తయారు చేయాలి.

2. విదేశీ సంస్థల్లోనూ టీకా తయారీకి అనుమతివ్వాలి.

3. ఫారెన్ సంస్థల నుంచి టీకాలు కొని రాష్ట్రాలకు ఇవ్వాలి.

4. చాలా దేశాలు టీకాలను ఎక్కువగా నిల్వ చేసుకున్నాయి. రిక్వెస్ట్ చేసి వాటిని తెప్పించాలి.

అటు కరోనావైరస్ వ్యాప్తి వేగం ఢిల్లీలో గణనీయంగా మందగించిందని కేజ్రీవాల్ అన్నారు. గడిచిన 24 గంటల్లో సుమారు 2,200 కేసులు నమోదయ్యాయని, పాజిటివిటీ రేటు 3.5 శాతం ఉందని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story