రాజకీయాలకు ఇక గుడ్ బై..!

రాజకీయాలకు ఇక గుడ్ బై..!
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు.

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఇకపై సామాజిక సేవపై దృష్టిపెట్టనున్నట్లు తెలిపారు. తాను TMC, CPI, కాంగ్రెస్ లలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల మోదీ క్యాబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన 12 మంది కేంద్ర మంత్రులలో ఈయన ఒకరు. కాగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన నివాసాన్ని కూడా నెల రోజుల్లో ఖాళీ చేస్తానని బాబుల్‌ వెల్లడించారు. ప్రముఖ గాయకుడైన బాబుల్‌ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. మోదీ హయంలో తొలిసారి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రెండోసారి కూడా ఆయన అదే లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచి రెండోసారి కూడా ఆయన కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story