Tamil Nadu: భర్త నిర్వాకం.. యూట్యూబ్ చూసి భార్యకు డెలివరి.. బిడ్డ మృతి

Tamil Nadu: భర్త నిర్వాకం.. యూట్యూబ్ చూసి భార్యకు డెలివరి.. బిడ్డ మృతి
Tamil Nadu: గోమతి చాలా సేపు ప్రసవ వేదన అనుభవించి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Tamil Nadu: అరచేతిలో ఫోను.. అందుబాటులో యూట్యూబ్.. ఏం కావాలన్నా నిమిషాల్లో కళ్ల ముందు ఉంటుంది. తల్లి బిడ్డను ప్రసవించడం చూసి తన భార్యకు కూడా అలానే చేయాలనుకున్నాడో మహానుభావుడు.. అది కాస్తా బెడిసి కొట్టి కనులైనా తెరవని ఆ బిడ్డ కన్నుమూశాడు. భార్యకు తీవ్ర రక్తస్రావమై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

రాణిపేట్ జిల్లా్కు చెందిన లోగనాథన్.. ఏడాది క్రితం గోమతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమె గర్భం దాల్చడంతో డిసెంబర్ 13 డెలివరీ డేట్ ఇచ్చారు వైద్యులు. అయితే డిసెంబర్ 18వరకు పెయిన్స్ రాలేదని ఇంట్లోనే ఉండిపోయింది గోమతి.

అయితే అదే రోజు ప్రసవ వేదన పడుతున్న భార్యకు తన సోదరి గీత సాయంతో ఇంట్లోనే యూట్యూబ్ చూసి డెలివరీ చేయాలనుకున్నాడు లోగనాథన్. అతడి ప్రయత్నం వికటించి భార్య గర్భంలోనే బిడ్డ మృతి చెందాడు.. గోమతికి తీవ్ర రక్త స్రావం కావడంతో పున్నై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అనంతరం ఆమెను వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీనిపై ఆరోగ్య శాఖకు ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. భార్య కూడా తన అంగీకారం తెలిపిన తర్వాతే భర్త డెలివరీ ప్రక్రియను మొదలు పెట్టాడని పోలీసుల విచారణలో తేలింది.

గోమతి చాలా సేపు ప్రసవ వేదన అనుభవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో భర్త ఆమెను సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. ప్రెగ్నెన్సీ అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ.. చిన్న పొరపాటు జరిగినా తల్లి, బిడ్డల ప్రాణాలకు ప్రమాదం.

డెలివరీ చేయడం అంటే జ్యూస్ లేదా నూడిల్స్ చేయడం వంటిది కాదు అని డాక్టర్ అన్బుమణి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. దయచేసి ఎవరూ కూడా ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులు చేయకండి అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 108కి కాల్ చేయాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story