కళ్యాణి నన్ను కాదనుకున్నా ఇప్పటికీ ఆమె ఫోటో నా ఫోన్‌లో..

ఈ విషయంలో మా అమ్మ నన్నెప్పుడూ అరుస్తుంటుంది.. సిగ్గులేదు. తను నిన్ను కాదనుకుని వెళ్లిపోతే ఇంకా ఆమెనే పట్టుకుని..

దర్శకుడు సూర్య కిరణ్ బిగ్ బాస్ 4కి వచ్చిన ఓ కంటెస్టెంట్.. అంతకు ముందు ఆయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ బిగ్ బాస్ కి వచ్చిన తరువాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూర్య కిరణ్ ఎవరో తెలిసింది.. మరీ ముఖ్యంగా వచ్చిన మొదటి వారంలోనే ఎలిమినేట్ అయి ఆ విధంగానూ వార్తల్లో నిలిచారు. హౌస్‌లో ఎప్పుడూ ఇతర కంటెస్టెంట్లతో చిర్రుబుర్రులాడే సూర్య కిరణ్ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనలేకపోయినా నెటిజన్లను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. దానికి కారణం.. ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం వెల్లడించిన విషయాలే.

ఇటీవల కొన్ని మీడియా ఛానెళ్లు ఆయనను ఇంటర్వ్యూ చేశాయి. ఈ సందర్భంగా ఆయన జీవితంలో వచ్చిన మార్పులు ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు వెల్లడించారు. నటి కళ్యాణి (ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు ఫేం) ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి వివాహం చేసుకున్నానని కాని కొన్ని అనుకోని కారణాలవల్ల ఆమె నన్ను కాదనుకుని వదేలిసింది.. కానీ ఆమె అంటే ఇప్పటికీ నాకు చాలా ఇష్టం.. నా ఇద్దరు చెల్లెళ్ల తరువాతే ఆమెనే ఎక్కువ ఇష్టపడతాను..

నా ఫోన్‌లో ఇప్పటికే ఆమె ఫోటో ఉంటుంది.. ఈ విషయంలో మా అమ్మ నన్నెప్పుడూ అరుస్తుంటుంది.. సిగ్గులేదు. తను నిన్ను కాదనుకుని వెళ్లిపోతే ఇంకా ఆమెనే పట్టుకుని వేలాడుతావు.. ఆమె జ్ఞాపకాల్లోనే జీవితాన్ని గడిపేస్తావా ఏంటి అని తిడుతుంది అని అమ్మ చీవాట్లు పెడుతూనే ఉంటుందని సూర్య కిరణ్ అన్నారు. మళ్లీ ఇప్పుడిప్పుడే నా కెరీర్‌ను పునర్మించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇక నుంచి సినిమాలకు దగ్గరగా ఉంటాను.. బిగ్‌బాస్ తరువాత నా జీవితంలో మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను. బిగ్‌బాసే నన్ను మళ్లీ ప్రజలకు దగ్గర చేసింది. ఎలిమినేట్ అయినా తగినంత ప్రచారం లభించింది అని సూర్య కిరణ్ చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story