Bihar barber: అదృష్టం అంటే మనోడిదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..

Bihar barber: అదృష్టం అంటే మనోడిదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..
Bihar barber: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.లక్ ఉండాలే కానీ రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చు.

Bihar barber: అదృష్టం... ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. లక్ ఉండాలే కానీ రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చు.. ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి కూడా ఆ కోవా కిందికే వస్తాడు.. అతడో సామాన్య వ్యక్తి.. చేసేది బార్బర్ పని... సొంతంగా సెలూన్ షాప్ ఉంది.. క్రికెట్ అంటే పిచ్చి.. చూడడమే కాదు.. బెట్టింగ్ పెట్టడం కూడా ఓ హ్యాబిట్ గా పెట్టుకున్నాడు. అతడికో రోజు వచ్చింది. 'డ్రీమ్‌-11' రూపంలో అదృష్టం అతడి తలుపు తట్టింది. కోటి అతని వశమైంది. ఈ సంఘటన బిహార్‌లోని మధుబనీ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉండే.. అశోక్‌ కుమార్‌ ఠాకుర్‌ కి సెలూన్ షాప్ ఉంది. క్రికెట్‌పై ఉన్న ఆసక్తితో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ 'డ్రీమ్‌-11'లో తరచూ బెట్టింగ్‌ పెట్టేవాడు. అలాగే ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌పైనా బెట్టింగ్‌ పెట్టాడు. అందులో అనూహ్యంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఈ విషయం తెలియగానే అతడి ఆనందానికి అవధుల్లేవు..

గతంలో ఎన్నోసార్లు బెట్టింగ్‌ పెట్టానని, ఎప్పుడూ గెలవలేదని.. కానీ ఇప్పుడు ఇలా కోటి రూపాయలు గెలుచుకోవడం సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వచ్చిన ఈ డబ్బులతో అప్పు తీర్చుకొని సొంతంగా ఇల్లు కట్టుకుంటానని చెప్పుకొచ్చాడు అశోక్.. కోటి వచ్చినా.. తన వృత్తిని మాత్రం వదులుకోనని స్పష్టం చేశాడు.. కాగా రెండు మూడు రోజుల్లో అశోక్ ఖాతాలో ఈ డబ్బు జమ కానుంది.

Tags

Read MoreRead Less
Next Story