బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ఎలక్షన్‌లో ఇప్పుడు 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కరోనా నేపథ్యంలో ఓటర్లంతా సామాజిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

కోవిడ్ మహమ్మారి వాప్తి ఇంకా భయపెడుతూనే ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్ని పక్కాగా శానిటైజ్ చేశారు అధికారులు. ఈవీఎంలతోపాటు ఇతర సామాగ్రిని కూడా శుభ్రంగా ఉంచారు. ఓటర్లు కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఈసారి 80 ఏళ్ల పైబడిన వృద్ధులు పోలింగ్ కేంద్రానికి రాకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని EC కల్పించింది. అలాగే ఒక్కో పోలింగ్ కేంద్రంలో గతంలో 1600 మందిని అనుమతిస్తే ఈసారి గరిష్టంగా వెయ్యి మందికి మించకుండా చూస్తున్నారు అధికారులు. అటు, పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, PPE కిట్లు కూడా అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు 2 హెలికాఫ్టర్లు కూడా సిద్ధం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మిగతా చోట్ల 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.

బీహార్‌లో ఫస్ట్‌ఫేజ్ ఎలక్షన్‌లో దాదాపు 2 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మెజార్టీ మద్దతు ఎవరికి ఉంటుందనేదే ఇప్పుడు కీలకంగా మారింది. బుధవారం పోలింగ్ జరుగుతున్న 71 స్థానాల్లో RJD 42 చోట్ల పోటీ చేసింది. కాంగ్రెస్ 20 చోట్ల బరిలో ఉంది. JDU 35 చోట్ల అభ్యర్థుల్ని పెడితే, BJP 29 చోట్ల పోటీ చేస్తోంది. LJP కూడా 42 చోట్ల బరిలో నిలిచి సత్తా చాటాలని చూస్తోంది. తొలిదశ ఎన్నికల్లో ఆరుగురు మంత్రుల భవితవ్యం కూడా తేలబోతోంది.

Tags

Read MoreRead Less
Next Story