బిహార్‌లో ముగిసిన ఫస్ట్‌ఫేజ్ ఎలక్షన్స్‌ .. ఎక్కువ స్థానాలు ఎవరికంటే?

బిహార్‌లో ముగిసిన ఫస్ట్‌ఫేజ్ ఎలక్షన్స్‌ .. ఎక్కువ స్థానాలు ఎవరికంటే?

బిహార్ తొలి దశ పోలింగ్‌లోఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమికే ఎక్కువ స్థానాలు లభిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలిదశలో 71 సీట్లు మహాకూటమికి.. ఎన్డీఏకు 30 సీట్లు దక్కుతాయని సమాచారం. బుధవారం తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 54.26 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2015 ఎన్నికలతో పోలిస్తే తక్కువ పోలింగ్ నమోదైంది. పోలింగ్‌ జరిగిన 71 స్ధానాల్లో ఆర్జేడీ 42 మంది అభ్యర్ధులను బరిలో దింపగా.... జేడీయూ తరపున 35, బీజేపీ 29, కాంగ్రెస్‌ 21 మంది అభ్యర్ధులను పోటీలో నిలిపింది.

ఇక ఫస్ట్‌ఫేజ్ ఎలక్షన్స్‌ ముగియడంతో నేతలందా రెండో దశ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నారు. నవంబర్‌ 3న ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో వివిధ పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు..15 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన నితీశ్ తీవ్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలను ఎదుర్కొంటున్నారు. అటు మహాకూటమి నుంచి కూడా ఊహించని స్థాయిలో గట్టిపోటీ ఎదురవుతోంది.. నితీశ్ ప్రజాధరణ కూడా మునపటి కంటే తగ్గినట్లు సర్వేలు చెబుతున్నాయి.. అందుకే ఈసారి ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు.

Tags

Read MoreRead Less
Next Story