భయపెడుతున్న బర్డ్‌ఫ్లూ.. గుడ్లు, చికెన్ తినడంపై WHO సలహా

భయపెడుతున్న బర్డ్‌ఫ్లూ.. గుడ్లు, చికెన్ తినడంపై WHO సలహా
ఇది పక్షులలో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధికి కారణమవుతుంది.

వివిధ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వ్యాప్తి చెందుతున్నట్లు భారతదేశం ఇటీవల నివేదించింది. ఇప్పటివరకు, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రల్లో బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని ధృవీకరించాయి. పరిస్థితిని పర్యవేక్షించడానికి, వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం దేశ రాజధానిలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మానవులలో బర్డ్ ఫ్లూ సంక్రమణ కేసులు ఇంకా నివేదించబడలేదు.

బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఇది ఒక రకమైన ఇన్ఫ్లుఎంజా వైరస్ (H5N1 వైరస్), ఇది పక్షులలో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధికి కారణమవుతుంది.

మానవులలో బర్డ్ ఫ్లూ కేసులు అప్పుడప్పుడు సంభవిస్తాయి. H5N1 వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తి.. బర్డ్ ఫ్లూ సోకిన పక్షితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఇది మానవులలో వ్యాపిస్తుంది. అయితే ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి సంక్రమిస్తుందా లేదా అనేది ఇంకా నివేదించబడలేదు.

అయితే ఈ సమయంలో కోడి, బాతు, గుడ్లు లేదా ఎలాంటి పౌల్ట్రీలనైనా తినడం సురక్షితమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. WHO ఏం సిఫార్సు చేస్తుందో తెలుసుకుందాం.

గుడ్లు మరియు చికెన్ తినడంపై WHO సలహా:

బాగా ఉడికించిన గుడ్లు లేదా చికెన్ తినడం సురక్షితం" అని WHO వెబ్‌సైట్‌లో పేర్కొంది. అందువల్ల మీ ఆహారాన్ని కనీసం 70 డిగ్రీల సెల్సియస్ (సాధారణ వంట ఉష్ణోగ్రత) లో ఉడికించడం వల్ల మీ ఆహారంలో వైరస్ నిర్వీర్యమవుతుంది. బాగా శుభ్రపరిచిన గుడ్లు, చికెన్ తినడం అన్ని విధాల శ్రేయస్కరం.

పశుసంవర్ధక, మత్స్య, పాడి మంత్రి గిరిరాజ్ సింగ్ ఇటీవల పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏదైనా సమస్య రాకుండా ఉండటానికి తినడానికి ముందు మాంసం మరియు గుడ్డు పూర్తిగా ఉడికించాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story