Uttar Pradesh : బీజేపీకి ఊహించని షాకులు.. 48 గంటల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా..!

Uttar Pradesh : బీజేపీకి ఊహించని షాకులు.. 48 గంటల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా..!
Uttar Pradesh : యూపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీజేపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి.

Uttar Pradesh : యూపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీజేపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. కమల దళం నుంచి వలసల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి గుడ్‌బై చెప్పగా...తాజాగా మరో ఎమ్మెల్యే ముఖేష్ వర్మ బీజేపీకి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో యోగి సర్కార్ దళితులు, వెనుకబడిన తరగతులు, రైతులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందని ముఖేష్ వర్మ ఆరోపించారు.

అటు యూపీలో తాజా పరిణామాలు కమలనాథులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. యూపీ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య అఖిలేష్‌పార్టీలో చేరికతో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి. మౌర్య మద్దతుగానే బీజేపీని వీడుతున్నట్లు ముగ్గురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా కూడా మౌర్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగానే ఆయన పార్టీ వీడినట్లుగా తెలుస్తోంది. ప్రసాద్ మౌర్య పార్టీ రాజీనామాతో బీజేపీకి ఎదురుదెబ్బేనని నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.

మరోవైపు యోగి కేబినెట్‌ నుంచి వైదొలగిన నేతలు ఓబీసీ వారే కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంక్‌ బీజేపీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నష్టం వాటిల్ల వచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలకు బీజేపీ ఎలా చెక్‌పెడుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అటు పోలింగ్ దగ్గరపడుతుండటంతో...కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా విడుదల చేశారు. మొత్తం 125 మంది అభ్యర్థులను ప్రకటించగా, వీరిలో 50 మంది మహిళలు, 50 మంది యువత ఉన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ప్రియాంక గాంధీ వాద్రా దాటవేసే సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story