విశ్వాస పరీక్ష జరిగే వరకూ సభను అడ్డుకుంటాం : బీజేపీ

విశ్వాస పరీక్ష జరిగే వరకూ సభను అడ్డుకుంటాం : బీజేపీ

కర్నాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాము ఎవరితో చర్చలకు సిద్ధంగా లేమంటూ ముంబైలో మకాం వేసిన 14 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమకు ముప్పు ఉందని, భద్రత కల్పించాలని ముంబై పోలీసుల్ని కోరారు. ఖర్గే కానీ, ఆజాద్‌ కానీ తాము ఎవరితోనూ చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఎవరూ తమ దగ్గరకు రాకుండా చూడాలని కోరారు. ప్రస్తుతం వారంతా ముంబైలోని ఓ హోటల్‌లో ఉన్నారు. తాజాగా పోలీసులకు రాసిన లేఖలో MTB నాగరాజు కూడా సంతకం చేశారు. అటు, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు తమ రాజీనామాల ఆమోదం కోరుతూ సుప్రీంకి వెళ్లారు. 10 మంది రెబల్స్ పిటిషన్‌లో వీటిని కూడా ఇంప్లీడ్ చేయాలని వీరి తరపు అడ్వొకేట్ కోరారు. దీంతో కె.సుధాకర్, రోషన్‌ బేగ్, MTB నాగరాజ్, మునిరత్న, ఆనంద్ సింగ్‌ పిటిషన్‌ను రేపు విచారించనుంది కోర్టు. స్పీకర్ రమేష్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే తమ రిజైన్లు ఆమోదించడం లేదని రెబల్స్ ఆరోపిస్తున్నారు.

ఈ తాజా పరిణామాలతో కాంగ్రెస్-JDS ముఖ్యనేతలు చర్చించారు. రెబల్స్‌తో చర్చలు ఆపేయాలని నిర్ణయించారు. కుమారస్వామి, ఖర్గే, డీకే శివకుమార్ తమ ముంబై టూర్ రద్దు చేసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడతో ముఖ్యమంత్రి కుమారస్వామి చర్చించారు. తర్వాత స్పీకర్‌ను కలిసి విశ్వాస పరీక్షకు తేదీ ఖరారు చేయాలని కోరారు. ఇక, బెంగళూరులోని తాజ్‌ వివంతా హోటల్‌లో సీఎల్పీ సమావేశం కూడా హాట్‌హాట్‌గానే జరిగింది. సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే సహా సీనియర్లు.. పార్టీ MLAలతో మాట్లాడారురు. సభలో అనుసరించాల్సిన వ్యూహం, బలాబలాల లెక్కలపై ఈ మీటింగ్‌లో చర్చించారు. బుధవారం విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలనే దానపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అంతా ఐక్యంగా ఉండి బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలని నిర్ణయించారు.

విశ్వాస పరీక్ష జరిగే వరకూ సభ అడ్డుకోవాలని BJP నిర్ణయించింది. అప్పటి వరకూ బెంగళూరు శివారులోనే తమ క్యాంప్‌ను కొనసాగించబోతున్నారు. అలాగే సభా కార్యక్రమాలను అడ్డుకుంటామని పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. స్పీకర్‌, ముఖ్యమంత్రి తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉందని మండిపడ్డారు. నేరుగా స్పీకర్‌ చేతికే రాజీనామాలు అందించాక కూడా పెండింగ్ ఎందుకని నిలదీశారు యడ్యూరప్ప. సుప్రీం కోర్టు నిర్ణయం వచ్చే వరకూ ఎవరిపైనా అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు లేదని అన్నారు. ఇండిపెండెంట్లు సహా మరికొందరు మద్దతు తమకే ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story