కొక్కొరొక్కో.. కోడి ధర కిలో రూ.15

కొక్కొరొక్కో.. కోడి ధర కిలో రూ.15
చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచించినా ప్రజలు కోడి పేరెత్తితేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు.

కరోనా వైరస్ ప్రతాపం కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటే కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతోంది.. తాజాగా బర్డ్‌ఫ్లూ కోడి కూరను తిననివ్వకుండా చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు, బాతులు బర్డ్ ఫ్లూ బారిన పడి మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చికెన్, కోడిగుడ్లు తినకూడదనే ప్రచారం సాగుతోంది. దాని ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడడంతో పౌల్ట్రీ వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు.

చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచించినా ప్రజలు కోడి పేరెత్తితేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు. హర్యానా రాష్ట్రంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని జింద్ జిల్లాలో కోళ వ్యాపారం జోరుగా సాగుతుంటుంది.

పౌల్ట్రీ హబ్‌గా పేరొందిన జింద్ జిల్లా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ప్రతి రోజు 4 లక్షల కోళ్ల విక్రయం జరుగుతుందని అంచనా. బర్డ్ ఫ్లూ కారణంగా సేల్స్ పడి పోయి ప్రతి రోజు లక్షల రూపాయల్లో నష్టపోతున్నారు. ఢిల్లీ మార్కెట్లో బ్రాయిలర్ కోడి ధర కిలో రూ.15లు పలుకుతుండడంతో చికెన్ దుకాణ దారులు గగ్గోలు పెడుతున్నారు.

చికెన్‌ని 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉడకబెట్టి వండితే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. పక్షుల మరణానికి ఇతర కారణాలు ఉన్నా చికెన్ పేరు చెబితే బర్డ్ ప్లూ గుర్తొచ్చి భయపడిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story