భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దులో సొరంగం

భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దులో సొరంగం

జమ్మూలోని భారత్‌- పాక్‌ అంతర్జాతీయ భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దులో సొరంగం గుర్తించిన సొరంగం సాంబ సెక్టర్‌లో టన్నెల్‌ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. భారత భూభాగంలోకి ఉన్న ఈ సొరంగం పొడవు 50 మీటర్లు. లోతు 25 అడుగులు ఉంది. ఈ టన్నెల్‌లో ప్లాస్టిక్ సంచుల్లో ఇసుక నింపిన బస్తాలు కనిపించాయి.. ఈ సంచులపై పాకిస్థాన్‌కు చెందిన చిరునామా ఉంది. దాదాపు 10 ప్లాస్టిక్‌ ఇసుక సంచులను స్వాధీనం చేసుకున్నారు.

పంజాబ్‌లో ఇటీవల ఐదుగురు టెర్రరిస్టులను మన ఆర్మీ మట్టుబెట్టింది. చొరబాట్లుకు అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికలతో అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలు మెగా డ్రైవ్‌ను చేపట్టాయి. ఇందులో భాగంగా జమ్మూలోని సాంబా సెక్టార్‌ పరిధిలో పెట్రోలింగ్‌ చేస్తుండగా ఈ సొరంగ మార్గాన్ని గుర్తించాయి. ఈ సొరంగానికి కేవలం 400 మీటర్ల దూరంలో పాకిస్థాన్‌ సరిహద్దు పోస్ట్‌ ఉంది. ఇలాంటి సొరంగ మార్గాల ద్వారా అక్రమంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు రవాణా చేసే అవకాశం ఉండడంతో వీటిని గుర్తించేందుకు బీఎస్‌ఎఫ్‌ బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. గతంలోనూ ఇలాంటి సొరంగ మార్గాలు గుర్తించిన నేపథ్యంలో రాడార్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

ఈ తరహా సొరంగ మార్గాలు ఇంకా ఉన్నాయోమో కనుగొనేందుకు ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టారు.. సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని సరిహద్దు కమాండర్లను BSF డైరెక్టర్‌ జనరల్‌ రాకేశ్‌ ఆస్థానా ఆదేశించారు. భారత్-పాక్ మధ్య సరిహద్దు పొడవు 3 వేల 300 కిలోమీటర్లు. ఇది జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల వెంబడి ఉంది. ఉగ్రవాదులు చొరబడటంపై నిఘా హెచ్చరికల నేపథ్యంలో ఈ సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story