కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమ్మాయి వివాహ వయస్సును..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమ్మాయి వివాహ వయస్సును..
అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లి కావడం వల్లే ఎక్కువగా శిశు మరణాలు, మాతృ మరణాలు జరుగుతున్నాయని కేంద్రం భావించింది.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయి వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మహిళల కనీస వివాహ వయస్సు పెంపుపై దృష్టి సారించిన కేంద్రం... కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో పార్లమెంట్ ముందుకు ఈ బిల్లు రానుంది. కేంద్రం నిర్ణయంతో.. బాల్య వివాహాల నిరోధక చట్టం-2006, హిందూ వివాహ చట్టం 1955, అలాగే ప్రత్యేక వివాహ చట్టాలకు సవరణ అనివార్యమైంది.

మహిళల పెళ్లి వయస్సు తక్కువగా ఉండటం వల్ల లేనిపోని ఇబ్బందులొస్తున్నాయని భావించిన కేంద్రం... దీనిపై అధ్యయనం చేయడానికి గతేడాది మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయాజైట్లీ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పురుషులతో అన్నింటా సమానంగా తన జీవన విధానాన్ని మార్చుకున్న మహిళలకు.... ఏ వయస్సులో పెళ్లి చేసుకుంటే అన్ని విధాలా కలిసొస్తుందనే విషయాన్ని ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఈ కమిటీ అందించిన సూచనల మేరకు కేంద్రం అడుగులు వెయ్యిబోతోంది.

అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లి కావడం వల్లే ఎక్కువగా శిశు మరణాలు, మాతృ మరణాలు జరుగుతున్నాయని కేంద్రం భావించింది. ప్రస్తుతం కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు.. కాగా ఈ వయసును మూడేళ్లు పెంచాలని కేంద్రం యోచించింది. పురుషులతో సమానంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్న మహిళలకు వివాహం ఓ అడ్డంకిగా మారకుండా ఉండేలా చట్టంలో మార్పులు తీసుకురానుంది.

Tags

Read MoreRead Less
Next Story