రాజ్యసభలో జరిగిన గొడవ దృశ్యాలను బయటపెట్టిన కేంద్రం..!

రాజ్యసభలో జరిగిన గొడవ దృశ్యాలను బయటపెట్టిన కేంద్రం..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినా హీట్ మాత్రం తగ్గడం లేదు. ఇన్నాళ్లు అధికార, విపక్షాల మాటల తూటాలతో ఉభయసభలు హోరెత్తాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినా హీట్ మాత్రం తగ్గడం లేదు. ఇన్నాళ్లు అధికార, విపక్షాల మాటల తూటాలతో ఉభయసభలు హోరెత్తాయి. ఇపుడు సభ ముగిసిన తర్వాత కూడా బయట.. ఆరోపణలు, విమర్శలతో వేడెక్కుతోంది. సభా వ్యవహారాలపై విపక్షాల ఆరోపణలకు కేంద్రం ఖండించింది. రాజ్యసభలో జరిగిన గొడవ దృశ్యాలను కేంద్రం బయటపెట్టింది. ఎంపీలకు, మార్షల్స్‌కు మధ్య తోపులాట జరిగింది. లేడీ మార్షల్స్‌ను ప్రతిపక్ష మహిళా ఎంపీలు చుట్టుముట్టారు. పెగాసస్, నూతన వ్యవసాయం చట్టం సహా పలు అంశాలపై చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేపర్లు గాల్లోకి విసిరేసారు. ప్రతిపక్షాలను నియంత్రించేందుకు మార్షల్స్‌ ప్రయత్నించారు.

మంగళవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు హాట్‌టాపిక్‌గా మారింది. కొందరు విపక్ష ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ పోడియం ముందు బల్లలు ఎక్కి నినాదాలు చేయడం, పేపర్లు గాల్లోకి విసిరివేయడంపై కేంద్రం సీరియస్ అయింది. ప్రతిపక్ష సభ్యుల తీరు వల్లే ఉభయసభలు గడువు కంటే ముందే వాయిదా పడ్డాయని ఏడుగురు కేంద్రమంత్రులు అసహనం వ్యక్తం చేశారు. విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని మంత్రులు డిమాండ్ చేశారు. ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్‌ను కోరతామని కేంద్రమంత్రులు తెలిపారు.

రాజ్యసభలో దాడిని నిరసిస్తూ విపక్షాలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించాయి. పెగాసస్‌పై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా సభా అర్థాంతరంగా వాయిదా వేయడాన్ని తప్పుబట్టాయి. మార్చ్ అనంతరం విపక్ష నేతలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌ సెక్యూరిటీలో లేని బయటివారిని తీసుకొచ్చి మార్షల్స్‌లో పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని అధికార, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బయటి వ్యక్తులతో మహిళా ఎంపీలపై భౌతికదాడి చేయించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న భావన కల్గిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story