కరోనా వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు ఉచితంగా ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం..!

కరోనా వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు ఉచితంగా ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం..!
కరోనా వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు ఉచితంగా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్రం కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు ఫ్రీగా సరఫరా చేయనుంది.

కరోనా వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు ఉచితంగా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్రం కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు ఫ్రీగా సరఫరా చేయనుంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను కేంద్రానికి ఒక్కో డోసుకు 150 రూపాయలకు అమ్ముతోంది. అదే టీకాను రాష్ట్రాలకు 400 రూపాయలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు 600 రూపాయలు ఇస్తామని ప్రత్యేక ధరలు నిర్ణయించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. వన్‌ నేషన్ వన్ ట్యాక్స్ ఉన్న దేశంలో.. ఒకే వ్యాక్సిన్‌కు మూడు ధరలా అంటూ సోనియా గాంధీ, మమతా బెనర్జీ, కేటీఆర్.. ఇలా ప్రతిపక్ష నేతలంతా కేంద్రాన్ని విమర్శించారు. దీంతో కేంద్రం దిగొచ్చింది. కేంద్రం కొనుగోలు చేసే వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story