ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాం.. వదంతులు నమ్మొద్దు : మన్‌ కీ బాత్‌లో మోదీ

ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాం.. వదంతులు నమ్మొద్దు : మన్‌ కీ బాత్‌లో మోదీ
మన్‌ కీ బాత్‌లో భాగంగా ఇవాళ దేశప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

వ్యాక్సిన్ విషయంలోనూ, కరోనా నియంత్రణ విషయంలోనూ వందతుల్ని నమ్మొద్దని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్‌ కీ బాత్‌లో భాగంగా ఇవాళ దేశప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా మొదటి దశను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నామని, ఇప్పుడు సెకండ్ వేవ్ తుఫాన్‌లా దేశాన్ని వణికిస్తోందని అన్నారు. ఈ టైమ్‌లో.. నిపుణులు, సైంటిఫిక్ ఆధారాలతో చెప్పిన వాటినే నమ్మాలని సూచించారు. ఈ మహమ్మారి మన సహనం పరీక్షిస్తోందని.. ఎందర్నో బలితీసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని తెలిపిన మోదీ.. మే1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు వేస్తారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story