చంద్రయాన్‌-2 రీలాంచ్‌ డేట్ ఖరారు

చంద్రయాన్‌-2 రీలాంచ్‌ డేట్ ఖరారు

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 2 రీలాంచ్‌ డేట్ దాదాపు‌ ఖరారు చేశారు. జులై 21 అర్ధరాత్రి ప్రయోగం ఉంటుందని ఇస్రో వర్గాలంటున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొద్ది గంటల్లో కౌంట్‌ డౌన్‌ ఉంటుందని భావిస్తున్నారు.

వాస్తవానికి చంద్రయాన్‌ 2 ఈ నెల 15 అర్దరాత్రి ప్రయోగించాల్సి ఉంది. కౌంట్‌డౌన్‌ కూడా మొదలైంది. కానీ ప్రయోగానికి గంట ముందు లూనార్‌ మిషన్‌ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని ఆపేశారు. కాసేపట్లో నింగికి ఎగుస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో ప్రయోగం ఆగిపోవడం కాస్త నిరాశపరిచింది. అయితే సాంకేతిక సమస్యలు సరిదిద్దామని... జులై21 అర్ధరాత్రి ప్రయోగానికి సిద్దం చేసినట్టు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story