జాతీయం

వావ్.. చిరుకి సూపర్ 'బర్త్ డే' గిప్ట్ ఇచ్చారుగా భార్యాభర్తలు..

చిరంజీవి స్టెప్పులకి ఫిదా అవని ప్రేక్షకులూ ఉండరు.. నటీనటులూ ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఆ తరువాత ఎంత మంది వచ్చినా

వావ్..  చిరుకి సూపర్ బర్త్ డే గిప్ట్ ఇచ్చారుగా భార్యాభర్తలు..
X

చిరంజీవి స్టెప్పులకి ఫిదా అవని ప్రేక్షకులూ ఉండరు.. నటీనటులూ ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఆ తరువాత ఎంత మంది వచ్చినా యూత్ లో మెగా స్టార్ స్టెప్పులకే మంచి క్రేజ్. ఆయన 65వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా అభిమాన హీరో చిరుకి ఓ చిరు కానుక అంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం సుధాకర్ కోమాకుల తన శ్రీమతి హారికతో కలిసి చిరంజీవి సైతం కన్నార్పకుండా చూసేలా స్టెప్పులేశారు. ఛాలెంజ్ చిత్రంలోని ఇందువదన కుందరదన పాటను .. రీ క్రియేట్ చేసి మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ గా ఇచ్చారు.

ఆదిత్య మ్యూజిక్ తమ అఫీషియల్ యూట్యూబ్ లో ఈ సాంగ్ ని అప్ లోడ్ చేసింది. ఈ జంట చేసిన డ్యాన్స్ కి ఫిదా అయిన చిరంజీవి వారికి అభినందనలు తెలుపుతూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. మీ డ్యాన్స్ చూస్తుంటే నా పాత రోజులు గుర్తొచ్చాయి. నీ శ్రీమతి హారిక సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తే ఎంతో గ్రేస్, బాడీ లాంగ్వేజ్ తో స్టెప్పులేసింది. ఆమెకు నీ కన్నా ఎక్కువ మార్కులు ఇస్తున్నాను. అమెరికాలో ఉన్నారు కాబట్టి ఇలా మీతా నా సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నాను. మీ ఇద్దరూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లా కలకాలం హాయిగా ఉండండి అని ఆశీర్వదించారు.


Next Story

RELATED STORIES