CM Stalin : 12 రాష్ట్రాల సీఎంలకు లేఖ.. నీట్‌ పరీక్షను వ్యతిరేకించాలని..!

CM Stalin : 12 రాష్ట్రాల సీఎంలకు లేఖ.. నీట్‌ పరీక్షను వ్యతిరేకించాలని..!
CM Stalin : వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ను వ్యతిరేకించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.

CM Stalin : తమిళనాడు సీఎం స్టాలిన్ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ను వ్యతిరేకించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సహా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన ప్రయత్నాలను లేఖలో ప్రస్తావించారు. నీట్‌ రద్దుకు తమ మద్దతు ప్రకటించాలని 12 రాష్ట్రాల సీఎంలను స్టాలిన్ కోరారు. త్వరలో స్టాలిన్ లేఖలను ఆయా రాష్ట్రాల సీఎంలను డీఎంకే ఎంపీల బృందం కలిసి స్వయంగా అందజేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story