Kerala: కేరళలో చీరకట్టు వివాదం.. విద్యాసంస్థలపై మంత్రి బిందు ఫైర్..

Kerala (tv5news.in)

Kerala (tv5news.in)

Kerala: చీరకట్టుకోవడం రాష్ట్ర ప్రగతిశీల వైఖరికి నిదర్శనం అన్న విద్యాసంస్థల వ్యాఖ్యలను బిందు ఖండించారు.

Kerala: ప్రపంచంలో చాలావరకు వృత్తులకు యూనిఫార్మ్ ఉన్నట్టుగానే టీచర్ వృత్తికి చీర యూనిఫార్మ్ అని కెరళలోని పలు విద్యాసంస్థలు టీచర్లపై అనవసరమైన రూల్స్‌ను రుద్దుతున్నాయి. దీంతో అక్కడి టీచర్లు అంతా దీనిని కలిసికట్టుగా వ్యతిరేకిస్తున్నారు. ఏ దుస్తుల్లో స్కూల్‌కు రావాలో తమకు తెలుసంటూ ఫలానా సంస్థలపై ఫైర్ అవుతున్నారు. అంతే కాక ఈ సమస్యను కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు దృష్టికి తీసుకెళ్లారు. బిందు ఆయా విద్యాసంస్థలకు ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

చీరకట్టుకోవడం రాష్ట్ర ప్రగతిశీల వైఖరికి నిదర్శనం అన్న విద్యాసంస్థల వ్యాఖ్యలను బిందు ఖండించారు. ఎలాంటి దుస్తులు ధరించాలో అది వ్యక్తిగత అభిప్రాయం అని బిందు అన్నారు. తాను మినిస్టర్‌ మాత్రమే కాక ఒక కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నానని గుర్తుచేశారు. కాలేజీకి తాను కూడా చుడిదార్‌లు వేసుకెళ్తానని వెల్లడించారు.

కేరళలో టీచర్ల చీరకట్టు వివాదం ఇప్పటిది కాదని, ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయంపై ప్రభుత్వం విద్యాసంస్థలను మందలించిందని బిందు అన్నారు. ఏ సంస్థలో పనిచేస్తున్నా సరే.. టీచర్లు వారికి నచ్చిన దుస్తులను వేసుకోవచ్చని స్పష్టం చేశారు. టీచర్‌కు ఉండే అనేక బాధ్యతలలో చీరకట్టు అనేది ఒక బాధ్యత కాదని, ఎవరైనా ఎలాంటి దుస్తులు ధరించాలి అన్నది వారి వ్యక్తిగత విషయమని తెలిపారు బిందు.

2014 మే 9న ఇదే విషయంప విద్యాశాఖ క్లారిటీ ఇచ్చినా కూడా పలు విద్యాసంస్థలు ఇంకా తమ వైఖరిని మార్చుకోవట్లేదని మండిపడ్డారు బిందు. అయినా ఇప్పటికీ రాష్ట్రంలోని అనేక సంస్థలు ఇలాంటి పద్ధతులను కొనసాగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అందుకే మరోసారి ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. టీచర్ వృత్తిలో ఉన్నవారు మాత్రమే కాదు.. ఎవరైనా ఎలాంటి దుస్తులు ధరించాలి అని నిర్ణయించుకునే హక్కు వారికి ఉండాలి.

Tags

Read MoreRead Less
Next Story