Congress: కాంగ్రెస్‌లో నయా జోష్.. 2024లో అధికారమే లక్ష్యం..

Congress (tv5news,in)

Congress (tv5news,in)

Congress: ఇటీవల దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది.

Congress: ఇటీవల దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. హిమాచల్ ప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్ చేయగా.. మిగిలిన రాష్ట్రాల్లోను కీలక స్థానాలను గెలుచుకుంది. ఉప ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ పెరిగింది. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావించిన హస్తం పార్టీ అధిష్టానం మరింత దూకుడు పెంచేందుకు రెడీ అవుతోంది.

2024లో అధికారమే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకు 15 రోజుల ప్రణాళికను సిద్ధం చేసింది. నవంబర్ 14 నుంచి 29 వరకు జన జాగరణ్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా సామూహిక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దండి మార్చ్ తరహాలో ఉద్యమ లోగోను ఆవిష్కరిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈనెల 12 నుంచి సోషల్ మీడియాల ద్వారా ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది.

అలాగే నిరంతరం ప్రజల్లో ఉంటూ మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని అన్ని రాష్ట్రాల నేతలకు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా పెట్రో ధరలు తగ్గించింది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజీల్‌పై 10 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. కేంద్రం బాటలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రో ధరలపై పన్నుల భారాన్ని తగ్గించగా.. కాంగ్రెస్ అధికారంలో పంజాబ్ ప్రభుత్వం సైతం పెట్రోల్, డీజీల్ రేట్లు తగ్గించింది.

అయితే తగ్గించిన ధరలు ఏమాత్రం సరిపోదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పెట్రోల్, డీజీల్ ధరలను మరింత తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. పెరుగుతున్న వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవడంతో పాటు తీవ్ర ఆర్థిక మాంద్యం, అత్యధిక నిరుద్యోగ రేటు, వ్యవసాయ సంక్షోభం, పేదరికం పెరిగిందని విమర్శిస్తున్నారు.

మొత్తానికి ఉప ఎన్నికల్లో వచ్చిన గెలుపుతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం పక్కా ప్రణాళికలతో ప్రజలకు చేరువయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి.. 2024లో అధికారం తెచ్చిపెడుతుందా? లేదా..? అనేది చూడాలి.

స్పాట్..

Tags

Read MoreRead Less
Next Story