టీషర్టు వేసుకొని అసెంబ్లీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. షాకిచ్చిన స్పీకర్..!

టీషర్టు వేసుకొని అసెంబ్లీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. షాకిచ్చిన స్పీకర్..!
విమల్ చుడాస్మ గతవారం టీషర్టు, ప్యాంటు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో ఇలా రావొద్దని స్పీకర్ హెచ్చరించారు.

అసెంబ్లీలోకి టీషర్టులో వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చుడాస్మను సభ నుంచి బయటకు పంపించారు గుజరాత్ స్పీకర్ రాజేంద్ర త్రివేది.. విమల్ చుడాస్మ గతవారం టీషర్టు, ప్యాంటు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో ఇలా రావొద్దని స్పీకర్ హెచ్చరించారు. అయితే నిన్న(సోమవారం) కూడా విమల్ చుడాస్మ..టీషర్టులోనే వచ్చారు.

దీనిపైన స్పీకర్ అసహనం వ్యక్తం చేస్తూ.. ఆయనను బయటకు వెళ్ళిపోవాలని ఆదేశించారు. షర్ట్ లేదా కుర్తా వేసుకుంటే అసెంబ్లీకి రావాలని అన్నారు. అయితే తాను ధరించిన దుస్తులు సభకి తగినవి కావని తెలిపే చట్టాలేమైనా ఉన్నాయా? ఉంటే చూపాలని అని విమల్ చుడాస్మ స్పీకర్ తో వాగ్వాదానికి దిగారు.

స్పీకర్‌ ఆదేశాలను ఎమ్మెల్యే అంగీకరించకపోవడంతో ఆయనను మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని హోంమంత్రి ప్రదీప్సింగ్ జడేజా ప్రతిపాదించారు. దీంతో స్పీకర్‌..ఎమ్మెల్యేను మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.

కాగా సోమనాథ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు విమల్ చుడాస్మ.

Tags

Read MoreRead Less
Next Story