చివరి విమానం ఎక్కి ఇక్కడ నేను సురక్షితంగా.. కానీ అక్కడ నా వాళ్లు..

చివరి విమానం ఎక్కి ఇక్కడ నేను సురక్షితంగా.. కానీ అక్కడ నా వాళ్లు..
కొంతమంది సురక్షితమైన దేశానికి వెళుతున్నందుకు సంతోషంగా ఉన్నారు. మరొ కొంతమంది తమ కుటుంబాలను విడిచి..

ఎయిర్ ఇండియా కాబూల్ నుండి ఆదివారం వెళ్లిన చివరి విమానంలో 20 ఏళ్ల ఆఫ్ఘన్ విద్యార్థి సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాడు. తాలిబన్లు దేశ రాజధానిని ఆక్రమించిన సమయంలో విమానం ఎక్కి ఇక్కడకు రావడం అదృష్టంగా భావిస్తున్నాని అంటున్నాడు.

"అప్పటికే ఫ్లైట్‌లో దాదాపు 129 మంది ఉన్నారు. ఫ్లైట్ ఎక్కే ముందు నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నేను నిద్ర లేచిన వెంటనే, తాలిబన్లు రాజధాని కాబూల్‌ని కబళిస్తున్నారనే వార్త చదివాను." వెంటనే విమానాశ్రయానికి వెళ్లాను.

కానీ మార్గ మధ్యంలో భారీగా ట్రాఫిక్ ఉంది. దాంతో నేను నడుచుకుంటూనే విమానాశ్రయం చేరుకున్నాను. విమానంలో ఎక్కువగా భారతీయులు ఉన్నారు. నేను ముగ్గురు ప్రభుత్వ అధికారులను కలిసి మాట్లాడాను. మా విమానం రెండున్నర గంటలు ఆలస్యమైంది"

అదే చివరి విమానం. కానీ అదృష్టవశాత్తూ సురక్షితంగా ల్యాండ్ అయ్యాము" అని అబ్దుల్లా చెప్పారు. పాస్‌పోర్టు, వీసాలాంటివేమీ ఎవరీ దగ్గరా లేవు. ఇక్కడ నుంచి సురక్షితంగా బయటపడతామా లేదా అన్న ఆందోళనే అందరిలో నెలకొంది.

కొంతమంది సురక్షితమైన దేశానికి వెళుతున్నందుకు సంతోషంగా ఉన్నారు. మరొ కొంతమంది తమ కుటుంబాలను విడిచి వెళ్లిపోతున్నందుకు ఆందోళన చెందుతున్నారు. తాలిబన్లు విమానాలు రద్దు చేస్తారనే భయం అందరిలో ఉంది. దుబాయ్ వెళ్తున్న ఒక విమానం రద్దు కావడాన్ని మేము కళ్లారా చూశాము" అందుకే అందరిలో ఆ భయం అని అబ్దుల్లా చెప్పారు.

"విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగినప్పుడు రాత్రి 8:30 అయింది. నా కుటుంబం నుండి నాకు కాల్ రాలేదు. కానీ నా కాల్ వారికి వెళ్లడంతో కొంత సంతోషించారు.

"ప్రమాదం ఉంది కానీ ఎవరైనా సురక్షితంగా ఉండాలనుకుంటే, పరిస్థితి అస్పష్టంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉండటం మంచిది. నా కుటుంబం సురక్షితంగా ఇంట్లోనే ఉన్నారు. కాబట్టి నేను పెద్దగా ఆందోళన చెందను" అని అబ్దుల్లా చెప్పారు. కానీ ఏ మూలో కించిత్ భయం చోటు చేసుకుంది. అది అబ్దుల్లా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story