కరోనా మరణాలు ఈ 10 రాష్ట్రాల్లోనే ఎక్కువ.. !

కరోనా మరణాలు ఈ 10 రాష్ట్రాల్లోనే ఎక్కువ.. !
మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయి.

దేశంలో నమోదవుతున్న కరోనా మరణాల్లో 72.86% మరణాలు 10 రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, యూపీ, రాజస్థాన్, తమిళనాడులో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అటు దేశవ్యాప్తంగా తాజాగా గడిచిన 24 గంటల్లో 14,74,606 కరోనా టెస్టులు చేయగా 3,66,161 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో 3,754 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,26,62,575కి చేరుకుంది. అటు మరణాల సంఖ్య 2,46,116కి చేరుకుంది. అటు గడిచిన 24 గంటల్లో 3,53,818మంది డిశ్చార్జ్ అయ్యారు. 37,45,237యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 17.01కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story