మధ్య వయస్కులపైనే కరోనా ప్రభావం ఎక్కువ

మధ్య వయస్కులపైనే కరోనా ప్రభావం ఎక్కువ
కరోనా మహమ్మారి ఎవరి మీద ఎలా విజృంభిస్తుందో నిపుణులు సైతం ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు.

కరోనా మహమ్మారి ఎవరి మీద ఎలా విజృంభిస్తుందో నిపుణులు సైతం ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా పిల్లలు, వృద్దులపై ఉంటుందని.. మరణాలు కూడా వీరిలోనే ఎక్కువగా నమోదవుతాయని నిపుణులు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే, ఈ అంచనాలు పూర్తిగా తారుమారు అవుతున్నాయని నిపుణులు ఇప్పుడు చెబుతున్నారు. మధ్య వయస్కులు వారిపై కరోనా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. 35–60 ఏళ్లలోపున్న వారిపై, ముఖ్యంగా పురుషులపై దీని ప్రభావం ఎక్కువని చెప్తున్నారు. తోడు ఊబకాయం, అధిక బరువు ఉన్న వారిని కరోనా ఎక్కువగా టార్గెట్ చేస్తుందని అన్నారు. అధిక బరువు, షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ తదితర తీవ్ర సమస్యలున్న వారిలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.

చాలా మంది చిన్నపాటి లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకుంటున్నారని.. అయితే, ఇదే ప్రమాదంగా మారే అవకాశం ఉందని తెలుపుతున్నారు. మొదటిసారి జ్వరం వచ్చినపుడే పరీక్షలు చేపించుకోవాలని.. లేని యడల తరువాత అది న్యూమోనియాగా మారుతుంది. తరువాత ఆస్పత్రిలో చేరి ఆక్సిజన్‌ ఇవ్వడం, ఐసీయూలో చేర్చడం, వెంటిలేటర్‌ అమర్చే పరిస్థితి వచ్చి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు. అందుకే చిన్నపాటి లక్షణాలు ఉన్నపుడే మేలుకోవాలని అంటున్నారు.

ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలను ఇస్తుందని.. అయితే, ప్లాస్మా ఎవరి దగ్గర తీసుకున్నారనేది చాలా ముఖ్యమని అన్నారు. యాంటీబాడీస్‌ ఎక్కువగా ఉన్న వారని నుంచి తీసుకుంటున్న ప్లాస్మా మంచి ఫలితాలిస్తోంది. వైరస్‌ తీవ్రత ఎక్కువై వెంటిలేటర్‌ పెట్టాల్సిన రోగులకు ఇది బాగా పనిచేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story