దేశంలో కరోనా స్వైర విహారం.. ఆరు నెలల తర్వాత రికార్డుస్థాయిలో కేసులు..!

దేశంలో కరోనా స్వైర విహారం.. ఆరు నెలల తర్వాత రికార్డుస్థాయిలో కేసులు..!
దేశంలో కరోనా స్వైర విహారం చేస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కేసులు తాజాగా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కేసులు తాజాగా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సుమారు ఆరు నెలల తర్వాత 81వేల 466 కేసులు నమోదుకాగా.. 469 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య కోటి 23లక్షల 3వేల 131కు చేరగా.. మరణాల సంఖ్య లక్షా 63వేల 396కు చేరుకుంది. గత 24 గంటల్లో 50వేల 356 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కోటి 15లక్షల 25వేల 39 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6లక్షల 14వేల 696 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక క్రియాశీల రేటులో కూడా పెరుగుదల కనిపిస్తుడడం కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. రికవరీ రేటు కూడా 93.89శాతానికి తగ్గింది..

మరోవైపు మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది.గత కొద్ది రోజులుగా అక్కడ 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 47 వేలకు పైగా కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. వైరస్ అదుపులోకి రావడంలేదు. కరోనా ఉద్ధృతి ఇలాగే కొనసాగితే.. లాక్‌డౌన్ విధించడాన్ని తోసిపుచ్చలేమన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే. త్వరలో మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. తాను లాక్‌డౌన్‌ కోరుకోవడం లేదని, కానీ పరిష్కారమేంటని ప్రశ్నించారు. వైరస్‌ తీవ్రతను బట్టి రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 65 లక్షల మంది కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు తెలిపారు.మరోవైపు...పుణెలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు 12గంటల పాటు విధిస్తున్నట్లు తెలిపారు. వారం రోజులు బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. హోం డెలివరీ మాత్రం కొనసాగించవచ్చన్నారు. అంత్యక్రియలు, వివాహ వేడుకలు మినహా మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story