మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్ విజృంభణ

మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్ విజృంభణ
ఫిబ్రవరి రెండో వారం నుంచి కరోనా కేసులు పెరగడం కలవరపెడుతోంది.

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. ఫిబ్రవరి రెండో వారం నుంచి కరోనా కేసులు పెరగడం కలవరపెడుతోంది. గత 24 గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10,216 కొత్త కేసులతో పాటు 53 మంది మరణించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంబయి మహానగరంలోనే 1,173 కేసులు, మూడు మరణాలు నమోదవ్వడం కలవరం రేపుతోంది.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి 66లక్షల 86వేల 880 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 21లక్షల 98వేల399 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వీరిలో 20లక్షల 55వేల 951 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 52 వేల 393 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, కొత్తగా వస్తున్న కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటకల్లోనే 85 శాతంగా ఉంటున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక దేశ రాజధాని దిల్లీలో జనవరి 14 తర్వాత తొలిసారి కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 59,112 శాంపిల్స్‌ పరీక్షించగా.. 312 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మూడు మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా కోటి 26లక్షల 81వేల 441 శాంపిల్స్‌ పరీక్షించగా.. 6 లక్షల 40 వేల 494 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వీరిలో 6 లక్షల 27వేల 797మంది కోలుకోగా.. 10,918మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం అక్కడ 1,779 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.



Tags

Read MoreRead Less
Next Story