భర్త వీర్యం కోసం కోర్టుకెక్కిన భార్య.. సేకరించిన కాసేపటికే భర్త మృతి..!

భర్త వీర్యం కోసం కోర్టుకెక్కిన భార్య.. సేకరించిన కాసేపటికే భర్త మృతి..!
కరోనాతో చావు బతుకల మధ్య ఉన్న భర్త వీర్యం కావాలని గుజరాత్ లోని ఓ 29 ఏళ్ల మహిళ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.

కరోనాతో చావు బతుకల మధ్య ఉన్న భర్త వీర్యం కావాలని గుజరాత్ లోని ఓ 29 ఏళ్ల మహిళ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు అనుమతితో వీర్యం సేకరించారు వైద్యులు. అలా వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే అతను ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని మృతుడి భార్య న్యాయవాది వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే... గుజరాత్‌కు చెందిన దంపతులకు సంతానం లేదు. ఇటీవల సదరు మహిళ భర్తకి కరోనా సోకి అవయవాలు అన్ని దెబ్బతిన్నాయి. దీనితో అతను ఎప్పుడైనా చనిపోవచ్చునని వైద్యులు.. అతని భార్యకి, కుటుంబ సభ్యులకి వెల్లడించారు. ఈ క్రమంలో తన భర్త ప్రతిరూపాన్నైనా చూసుకునేందుకు వీలుగా బిడ్డను కంటానని, అందుకు భర్త వీర్యం కావాలని ఆమె కోరింది. అయితే అందుకు కోర్టు అనుమతి తప్పనిసరి అని వైద్యులు చెప్పడంతో.. సదరు మహిళ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపైన విచారణ చేపట్టిన హైకోర్టు వీర్య సేకరణకు అనుమతులు జారీ చేసింది. కానీ, వీర్యం సేకరించిన కొన్ని గంటల్లోనే అతను మృతి చెందాడు.

Tags

Read MoreRead Less
Next Story