కేంద్రం కీలక నిర్ణయం : మే1వ తేదీనుంచి 18 ఏళ్లునిండిన వారికి టీకా

కేంద్రం కీలక నిర్ణయం  : మే1వ తేదీనుంచి 18 ఏళ్లునిండిన వారికి టీకా
మే1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికి టీకా వేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా అందరికి సోకుతోంది. రాజకీయ నాయకులకు, ప్రముఖులకు సోకుతూ భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరింత చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ ను దేశవ్యాప్తంగా వేగవంతం చేయనుంది. మే1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికి టీకా వేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫేజ్ త్రీ వ్యాక్సినేషన్ లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

18 ఏళ్లు నిండిన వారందరికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయించింది. కోవిడ్ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొవాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో కరోనా వైరస్ కట్టడి చేయోచ్చనే యోచనలో కేంద్రం ఉంది. ఇప్పటికే ఈ మహమ్మారి సోకి దేశంలో లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రముఖులు సైతం కోవిడ్ తో పోరాడి మరణించారు. కరోనా నిబంధనలతో పాటు వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా కట్టడి చేయొచ్చనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story