Covid Third Wave: కోవిడ్ ప్రభావం తగ్గిందా..? ఇక థర్డ్ వేవ్ రానట్టేనా..?

Covid Third Wave (tv5news.in)

Covid Third Wave (tv5news.in)

Covid Third Wave: కోవిడ్ అనేది ఇండియాలోకి వచ్చి 544 రోజులు అవుతోంది.

Covid Third Wave: కోవిడ్ అనేది ఇండియాలోకి వచ్చి 544 రోజులు అవుతోంది. మొదటి కేసు నమోదు అయినప్పటి నుండి ఇప్పటివరకు కరోనా ఎంతోమంది ప్రాణాలను బలిదీసుకుంది. ఒకేరోజులో ఎన్నో వేలమంది మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు.

గడిచిన రెండు రోజుల్లో కోవిడ్ వచ్చిన వారి సంఖ్య ఒక్కసారిగా భారీగా తగ్గిపోయింది. కరోనా ప్రభావం మొదలయినప్పటి నుండి ఇంత తక్కువ సంఖ్యలో కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. 7, 579 కేసులతో తాజాగా ఈ రికార్డ్ దక్కింది. ఆ మరుసటి రోజు కూడా దేశవ్యాప్తంగా 10 వేల కంటే తక్కువే కేసులు నమోదయ్యాయి. కొంతవరకు ఇది ప్రజల్లో ఆశను రేకెత్తిస్తోంది.

కోవిడ్ ఇంకా పూర్తిగా పోలేదు. ఇలాగే విచ్చలవిడిగా తిరిగితే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది అని కొందరు అంటున్నారు. కానీ ఘననీయంగా తగ్గుతున్న కోవిడ్ కేసులను చూస్తుంటే థర్డ్ వేవ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు రణదీప్ గులేరియా. కేసులు తగ్గుతున్నాయంటే వ్యాక్సిన్ ప్రభావం బాగానే ఉందని అర్థం అని ఆయన చెప్తున్నారు.

ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా అది మునుపటి లాగా అంత ఎఫెక్ట్‌తో ఉండకపోవచ్చని రణదీప్ స్పష్టం చేశారు. ఇది విన్నవారంతా ఇలాగే మెల్లమెల్లగా కరోనా పూర్తిగా పోవాలని కోరుకుంటున్నారు. ఎంత కాదన్నా కరోనా అనే మహమ్మారి ఇంకా జీవితంలో నుండి పూర్తిగా పోకుండా ఎంత స్వేచ్ఛగా తిరిగినా.. ఎక్కడో ఓ చోట బయముంటుంది.

Tags

Read MoreRead Less
Next Story