వ్యాక్సిన్ రెడీ.. 58 కోట్ల డోసులతో టీకా సిద్ధం

వ్యాక్సిన్ రెడీ.. 58 కోట్ల డోసులతో టీకా సిద్ధం
తొలి దశలో 30 కోట్ల మందికి టీకాలు వేస్తామని అధికారులు వివరిస్తున్నారు.

మూడు నెలల క్రితం వరకు కరోనా పేరునే కలవరిస్తూ.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసి విసిగి వేసారి.. ఏదైతే అదవుతుందిలే అని ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.. ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ వ్యాక్సిన్ తయారు చేసే పనిలో బిజీగా మారి ఎట్టకేలకు టీకాలు తీసుకువచ్చాయి.

ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, రష్యా దేశాల్లో టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. భారత్‌లో వ్యాక్సిన్ సరఫరాకు కేంద్రం సంసిద్ధమవుతోంది. తొలి దశలో 30 కోట్ల మందికి టీకాలు వేస్తామని అధికారులు వివరిస్తున్నారు. అయితే టీకాలు ఇచ్చిన తరువాత ఆ సూదులను ఎలా నిర్వీర్యం చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది అని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.

ఇదిలా ఉంటే కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 6 వేలను మించి ఉంది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ కరోనా తీవ్రత ఇంత ఎక్కువగా లేదు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,010 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్కరోజులో 95 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యధిక రికవరీ రేటు భారత్‌లోనే ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story