Bengaluru: ఏడాదిన్నరగా మార్చురీలోనే మృతదేహాలు.. చూసి షాకైన కుటుంబ సభ్యులు..

Bengaluru: ఏడాదిన్నరగా మార్చురీలోనే మృతదేహాలు.. చూసి షాకైన కుటుంబ సభ్యులు..
Bengaluru: వాళ్ల కుటుంబీకులు చనిపోయి దాదాపు ఏడాదిన్నర గడిచింది.

Bengaluru: వాళ్ల కుటుంబీకులు చనిపోయి దాదాపు ఏడాదిన్నర గడిచింది. కరోనాతో చనిపోవడంతో అంత్యక్రియలు తామే చేస్తామంటూ సమాచారమిచ్చారు మున్సిపల్ సిబ్బంది. వారిని కోల్పోయిన బాధను ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నాయి రెండు కుటుంబాలు. ఐతే ఇప్పుడు ఆకస్మాత్తుగా హాస్పిటల్‌ నుంచి రెండు కుటుంబాలకు ఫోన్ వచ్చింది. చనిపోయిన ఇద్దరి డెడ్‌బాడీస్‌ ఇంకా హాస్పిటల్‌ మార్చురీలోనే ఉన్నాయని చెప్పారు.

ఈ వార్త విన్న కుటుంబసభ్యులకు గురయ్యారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. బెంగళూరుకు చెందిన దుర్గ, మునిరాజు కరోనా కారణంగా గతేడాది జూలై 2న రాజాజీనగర్‌లోని మోడల్‌ హాస్పిటల్‌ చనిపోయారు. ఆ టైంలో బెంగళూరులో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో.. వైరస్‌ వ్యాప్తి భయంతో డెడ్‌బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించలేదు అధికారులు.

అంత్యక్రియలు బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక ఆధ్వర్యంలో నిర్వహించామని ప్రకటించారు. దీంతో కుటుంబసభ్యులు కూడా అంత్యక్రియలు పూర్తయ్యాయనుకుని ఉండిపోయారు. ఐతే దుర్గ, మునిరాజుల డెడ్‌బాడీలకు అంత్యక్రియలు పూర్తి కాలేదు.

ఏడాది కాలంగా హాస్పిటల్‌ మార్చురీలోనే ఉన్న డెడ్‌బాడీలు కుళ్లిపోయే స్టేజ్‌కు చేరుకున్నాయి. ఈ అమానవీయ ఘటనపై దుర్గ, మునిరాజుల కుటుంబాలు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అమానవీయ ఘటనపై దుర్గ, మునిరాజుల కుటుంబాలు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story