ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. సవాల్ చేస్తామంటున్న సర్కార్

ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. సవాల్ చేస్తామంటున్న  సర్కార్
ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయూల్లో 80శాతం పడకల్ని కరోనా రోగుల కోసం

ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయూల్లో 80శాతం పడకల్ని కరోనా రోగుల కోసం కేటాయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ నిలిపివేసింది. తమ వాదనలు పూర్తైనంత వరకూ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెల్లకూడదని స్టే ఇచ్చింది. అయితే, హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును తాము సవాల్ చేస్తామని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. కరోనా కట్టడికి ఈ నిర్ణయం అమలు చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాయి. కాగా.. ఇటీవల ఢిల్లీలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 28 ప్రైవేట్ ఆస్పత్రిల యాజమాన్యాలకు గత వారం అత్యవసర ఆదేశాలు కూడా జారీ చేసింది. ఢిల్లీ కరోనా యాప్ వివరాల ప్రకారం ఐసీయూ పడకలు కొరత ఉండటంతో కేజ్రీవాల్ సర్కార్ ఆ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆస్పత్రి వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story