అచ్చంగా అమీర్ ఖాన్ '3 ఇడియట్స్' చిత్రం సీన్ రిపీట్.. రైల్లో మహిళకు డెలివరీ చేసిన దివ్యాంగుడు

అచ్చంగా అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ చిత్రం సీన్ రిపీట్.. రైల్లో మహిళకు డెలివరీ చేసిన దివ్యాంగుడు
ల్యాబ్ టెక్నీషియన్ వీడియో కాల్‌ ద్వారా డాక్టర్ నుండి సూచనలు తీసుకున్నాడు. శిశువును ప్రసవించడానికి మహిళకు సహాయం చేశాడు.

నేనే సరిగ్గా నిలబడలేను. నేను ఆమెకు ఏం సహాయం చేయగలను అని అతడు నిరాశ చెందలేదు. వైకల్యం నా శరీరానికి కానీ నా మనసుకీ, మెదడుకీ కాదుగా అని తనని తాను తమాయించుకున్నాడు. తక్షణ కర్తవ్యం గురించి ఆలోచించాడు.. వెంటనే తన చేతిలో ఉన్న మొబైల్‌ సాయంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మాతృమూర్తికి సాయం అందించాడు. ఆమె పండంటి బిడ్డను కని.. కన్నీళ్లతోనే ఆ దివ్యాంగుడికి పాదాభిషేకం చేసింది.

శనివారం రాత్రి మధ్యప్రదేశ్ సంపారిక్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో గర్భిణీ స్త్రీకి మగపిల్లవాడిని ప్రసవించడంలో ఢిల్లీకి చెందిన శారీరక వికలాంగుడైన ల్యాబ్ టెక్నీషియన్ సహాయం చేసినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) తెలిపింది. ల్యాబ్ టెక్నీషియన్ వీడియో కాల్‌ ద్వారా వైద్యుడి నుండి సూచనలు తీసుకున్నాడు అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం '3 ఇడియట్స్' లోని ఒక దృశ్యం వలె. దివ్యాంగుడు బిడ్డను ప్రసవించడానికి మహిళకు సహాయం చేశాడు. మధురకు చేరుకున్నాక రైల్వే సిబ్బంది సాయంతో తల్లి, బిడ్డలను పట్టణంలోని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

"నేను మధ్యప్రదేశ్‌లో సాగర్ వెళ్ళడానికి రైలు ఎక్కాను, కాని ఢిల్లీ నుండి రైలు ఫరీదాబాద్ దాటినప్పుడు, ఒక మహిళ బాధతో ఏడుపు ప్రారంభించింది. తన సోదరుడితో కలిసి దామోకు ప్రయాణిస్తున్న మహిళ జనవరి 20 న ప్రసవానికి గడువు తేదీ దగ్గర పడడంతో ఊరు వెళుతోందని సహ ప్రయాణికుల ద్వారా తెలుసుకున్నారు.

కాని ఆమెకు అప్పుడే ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయని అర్థమైంది "అని నార్తరన్ రైల్వేలోని ల్యాబ్ టెక్నీషియన్ సునీల్ అన్నారు. ఢిల్లీలోని డివిజనల్ హాస్పిటల్‌లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సుపర్ణ సేన్‌కు పరిస్థితి వివరించాను. నాకు ఆమె వీడియో కాల్‌లో డెలివరీ చేసే విధానాన్ని సూచించారు. నేను సూచనలను జాగ్రత్తగా పాటించాను దాంతో మహిళ ఆరోగ్యకరమైన మగబిడ్డను ప్రసవించింది, "అని సునీల్ అన్నారు.

మధుర వద్ద రైలు ఆగడంతో రైల్వే అధికారులను అప్రమత్తం చేశానని ఆయన చెప్పారు. అక్కడ ఆర్పిఎఫ్ సిబ్బంది స్ట్రెచర్‌తో చేరుకున్నారు. మహిళను, ఆమె బిడ్డను మధుర జిల్లా ఆసుపత్రిలో చేర్చారు," అని సునీల్ వివరించాడు.

"ఆర్‌పిఎఫ్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ జ్యోతి యాదవ్ మహిళను మధుర ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేశారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని రైల్వే పోలీస్ అధికారి తెలియజేశారు. తనకు డెలివరీ చేసి ప్రాణాలు కాపాడిని సునీల్‌కి ధన్యవాదాలు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story