Gold Mithai: కేజీ స్వీట్ రూ.16,000.. అయినా క్యూ కట్టేస్తున్న జనం

Gold Mithai: కేజీ స్వీట్ రూ.16,000.. అయినా క్యూ కట్టేస్తున్న జనం
Gold Mithai: నేను ఈ డబ్బును ఆకలితో అలమటిస్తున్న వారి కోసం ఖర్చు చేస్తాను అని నెటిజన్ల హృదయాన్ని దోచుకున్నాడు.

Gold Mithai: గ్రాము బంగారం కొనుక్కున్నా రేపు అవసరానికి పనికొస్తుంది.. 16వేలు పెట్టి స్వీట్ ఎవరు కొంటార్రా అనకండి.. బంగారం అంతో ఇంతో కడుపులోకి వెళితే ఆరోగ్యానికి కూడా మంచిదే అంటున్నారు డాక్టర్లు.. అందుకేనేమో ఆ స్వీట్ షాప్ ముందు క్యూ కట్టేస్తున్నారు ఢిల్లీ వాసులు.

నోరూరించే ఆ స్వీట్ అంత ఖరీదైనా కొనేస్తున్నారు రాజధానిలోని మిఠాయి ప్రియులు. అంత ధర చెల్లించడానికి ఏ మాత్రం వెనుకాడ్డం లేదు.. అందుకే నో స్టాక్ బోర్డు కూడా వెలుస్తుంటుంది ఆ షాప్ ముందు అప్పుడప్పుడు.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ @oye.foodie అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో, 'గోల్డ్ మిఠాయి' అమ్ముతున్న దుకాణం కనిపిస్తుంది. దుకాణదారుడు స్వీట్ తయారు చేసి దానిపైన గోల్డ్ రేపర్‌ని అద్ది ముక్కలు కట్ చేస్తారు. @oye.foodie ప్రకారం, ఈ మిఠాయి కిలో ధర 16,000 రూపాయలు.

ఈ మిఠాయిని ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లోని షాగున్ స్వీట్స్‌లో విక్రయిస్తున్నారు. బంగారు మిఠాయి చాలా రుచిగా ఉందని అంటున్నారు కాస్ట్లీ కస్టమర్లు. ఓ కస్టమర్.. నేను దీనిని ప్రయత్నించాలనుకుంటున్నాను కానీ రేటు భయపెడుతోంది అని అన్నారు. మరో వినియోగదారుడు

వినియోగదారు ఇలా అన్నారు, "ఈ మిఠాయిని కొనుగోలు చేయడానికి బదులు, నేను కొత్త ఫోన్‌ని కొనుక్కుంటే బెటర్ అని అన్నాడు. " మరో వినియోగదారు నేను ఈ డబ్బును ఆకలితో అలమటిస్తున్న వారి కోసం ఖర్చు చేస్తాను అని నెటిజన్ల హృదయాన్ని దోచుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story