దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రమూకల స్కెచ్ !

దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రమూకల స్కెచ్ !
Delhi Police alerted of terror plot: దేశంలో భారీ అలజడి సృష్టించేందుకు ఉగ్రమూకలు స్కెచ్ వేశాయా? ఢిల్లీ టార్గెట్‌గా విధ్వంసానికి కుట్ర పన్నారా?

Delhi Police alerted of terror plot: దేశంలో భారీ అలజడి సృష్టించేందుకు ఉగ్రమూకలు స్కెచ్ వేశాయా? ఢిల్లీ టార్గెట్‌గా విధ్వంసానికి కుట్ర పన్నారా? ఆగస్టు15 కన్నా ముందే డ్రోన్లతో ఢిల్లీపై అటాక్‌కు ప్లాన్ చేశారా అంటే అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. డ్రోన్‌దాడులు జరగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఉగ్రదాడి జరిగే ప్రమాదముందన్న నిఘావర్గాల హెచ్చరికతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరంపై ఇటీవల తొలిసారి డ్రోన్‌ దాడి జరిగింది. అదే తరహాలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో ఈ సారి ఢిల్లీపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాలు అప్రమత్తం చేశాయి. దీంతో దేశరాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు.అన్ని ప్రధాన కూడళ్లతోపాటు..సమస్యాత్మక ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశాయి. తనిఖీలను కూడా ముమ్మరం చేశారు.

భారత ప్రభుత్వం 2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అప్పటి నుంచి పాక్‌ రగిలిపోతూ ఉంది. దేశంలో ఏదో రకంగా అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నుతూనే ఉంది. ఇప్పుడు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు టార్గెట్ గా మరో పన్నాగం పన్నుతోంది. నగరంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఉగ్రమూకలు దాడులకు పాల్పడొచ్చని భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో నగరంలో అశాంతిని సృష్టించడానికి పెద్ద కుట్రనే పన్నుతున్నాయని పేర్కొన్నాయి. ఈ అంశంపై దిల్లీ పోలీసులను సైతం అప్రమత్తం చేశాయి.

ఇంటెలిజెన్స్‌ విభాగం సహా నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేశారు. డ్రోన్‌ దాడులకు అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను సైతం ఏర్పాటు చేశారు. చారిత్రక ఎర్రకోట వద్ద నాలుగు యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. విద్రోహ డ్రోన్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలకు తొలిసారిగా శిక్షణ ఇస్తున్నారు.

గత నెల 26న దేశంలో తొలి డ్రోన్‌ ఉగ్రదాడి జరిగింది... జమ్మూలోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌పై రెండు డ్రోన్లతో అటాక్ చేశారు..ఒక్కో డ్రోన్‌ దాదాపు 2 కేజీల బరువైన శక్తివంతమైన IED బాంబ్‌లను మోసుకొచ్చి టార్గెట్‌పై పడేసి మెరుపువేగంతో మాయమైయ్యాయి. 5-6 నిమిషాల వ్యవధిలో ఈ రెండు ఎటాక్‌లు జరిగాయి. దాదాపు 100 మీటర్ల ఎత్తు నుంచి ఈ బాంబ్‌లను డ్రోన్ల సాయంతో వదిలారు. ఐతే.. చీకట్లో ప్రయాణం కారణంగా అవి సరిగ్గా టార్గెట్‌ను చేరుకోలేదు లేదంటే భారీ నష్టం జరిగి ఉండేది. ఈ డ్రోన్లు వదిలిన బాంబుల్లో ఒకటి IAF స్టేషన్‌పైన పడితే, మరొకటి నేలపై పడింది.

వీటిల్లో ఒకదాని టార్గెట్‌ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌-ATC టవర్‌ అయితే.. మరో డ్రోన్ టార్గెట్ అక్కడ పార్క్ చేసి ఉన్న IAF హెలికాఫ్టర్లు. అక్షాంసాలు, రేఖాంశాల ఆధారంగా టార్గెట్‌లను ఫిక్స్‌ చేసి మరీ పక్కాగా వాటిని ప్రయోగించారని ఇన్విస్టిగేటింగ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. ఆ తర్వాత కూడా బోర్డర్‌లో పలుచోట్ల డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. ఈ దాడి పాక్ ప్రేరేపిత ఉగ్రమూకల పనేనని దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి...ఇప్పుడు ఇదే తరహా దాడులతో దేశ రాజధాని ఢిల్లీలో అలజడి సృష్టించాలని ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి..

Tags

Read MoreRead Less
Next Story