పొలంలో మెరుస్తున్న రాళ్లు.. వజ్రాలంటూ వార్తలు

పొలంలో మెరుస్తున్న రాళ్లు.. వజ్రాలంటూ వార్తలు
విలువైన రాళ్ల కోసం వెతకడానికి గ్రామస్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు.

నాగాలాండ్‌లోని ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటున్నాడు.. అంతలో అతడికి ఒక మెరుస్తున్న రాయి కనిపించింది. ఈ విషయాన్ని అధికారులకు చేరవేయడంతో ఆ పరిసర ప్రాంతాల్లో దర్యాప్తు చేయమని రాష్ట్ర ప్రభుత్వం భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను కోరింది.

విలువైన రాళ్ల కోసం వెతకడానికి గ్రామస్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో 'వజ్రాలు' దొరికాయని పలు సోషల్ మీడియా పోస్టులు వచ్చాయి. నాగాలాండ్, జియాలజీ అండ్ మైనింగ్ డైరెక్టర్ ఎస్ మానేన్ గురువారం జారీ చేసిన ఉత్తర్వులలో అబెతుంగ్ లోథా, లాంగ్రికాబా, కెన్యెలో రెంగ్మా మరియు డేవిడ్ లౌపెని అనే నలుగురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ విషయంపై దర్యాప్తు జరిపి స్టేటస్ రిపోర్ట్ సమర్పించారు.

జిల్లాలోని వాచింగ్ ప్రాంతంలో విలువైన ఖనిజాలు లభిస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిశోధనలు విస్తృతం చేయాలని బృందాన్ని కోరారు. ఈ ప్రాంతంలో వజ్రాలు ఉన్నట్లు రికార్డులు లేనందున కొంతమంది గ్రామస్తులు కనుగొన్న చిన్న స్ఫటికాలు అసలు వజ్రాలు కాదని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ బృందం నవంబర్ 30 లేదా డిసెంబర్ 1 న గ్రామానికి చేరుకుంటుంది. ఇంతలో, వాచింగ్ గ్రామ కౌన్సిల్ రాళ్లకు సంబంధించి ప్రజలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని నిలిపి వేయాలని నోటీసులు జారీ చేసింది. దాంతో పాటు ఇతర గ్రామాలు లేదా పట్టణాల నుండి ఎవరైనా గ్రామంలోకి రావడాన్ని నిషేధించింది. పరిశోధన బృందం ఆ ప్రాంతంలో పర్యటించిన అనంతరమే దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story