మాస్క్ పెట్టుకుని.. థియేటర్లో కూర్చుని.. : నాగ్ అశ్విన్

మాస్క్ పెట్టుకుని.. థియేటర్లో కూర్చుని.. : నాగ్ అశ్విన్
వ్యాయామశాలలు, బార్లు, రెస్టారెంట్లు, మాల్స్, ఆలయాలు, బస్సులు, రైళ్లు, మెట్రోరైళ్లు, విమానాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

బయటకు అడుగు పెడితే ఎక్కడ వైరస్ అంటుకుంటుందో అని దాదాపు రెండు నెలలు లాక్డౌన్ విధించి ఇంట్లో కూర్చోబెట్టింది ప్రభుత్వం.. అనంతరం కొన్ని రంగాలకు పరిమితులతో కూడిన మినహాయింపులు విధించి తెరుచుకునేలా చేసింది.. రాను రాను అన్ని సంస్థలు, కార్యాలయాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఒక్క థియేటర్లు మాత్రం ఇంతవరకు తెరుచుకోలేదు.. ఇదే విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

"నాకు అందరి భద్రత ముఖ్యమే. వ్యాయామశాలలు, బార్లు, రెస్టారెంట్లు, మాల్స్, ఆలయాలు, బస్సులు, రైళ్లు, మెట్రోరైళ్లు, విమానాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం సినిమా థియేటర్లకు ఎందుకు ఇవ్వడం లేదు. థియేటర్లు తెరవడానికి ఇదే సరైన సమయం. మాస్క్ ధరించి థియేటర్‌లో కూర్చొని సినిమా చూడాలని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా"- నాగ్ అశ్విన్

కాగా, నాగ్ అశ్విన్ ఓ భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో ప్రభాస్-దీపిక పదుకొణె జంటగా నటించనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానెర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ సినిమాగా రూపు దిద్దుకోనుంది. ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' చిత్రానికి పని చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తరువాత నాగ్ అశ్విన్ లేదా ఓం రౌత్ చిత్రాల్లో నటించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story